spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- Kandukuru Incident: చంద్రబాబు పేరెత్తని పవన్ కళ్యాణ్.. కందుకూరు విషాదంపై ట్వీట్ వైరల్

Pawan Kalyan- Kandukuru Incident: చంద్రబాబు పేరెత్తని పవన్ కళ్యాణ్.. కందుకూరు విషాదంపై ట్వీట్ వైరల్

Pawan Kalyan- Kandukuru Incident: నెల్లూరులో చంద్రబాబు పర్యటనలో తీవ్ర అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తొక్కిసలాటలో ఎనిమది మంది మృత్యువాత పడ్డారు. చాలా మంది క్షతగాత్రులయ్యారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటన టీడీపీలో కలరపాటుకు గురిచేసింది. అన్ని పార్టీల నేతలు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. పత్రికా ప్రకటన విడుదల చేశారు. ట్విట్ చేశారు. ఇప్పుడది వైరల్ గా మారుతోంది. తెలుగుదేశం పార్టీ సభ జరుగుతుండగా తొక్కిసలాట జరగడం, ఎనిమిది మంది మృతిచెందడం, మరికొందరు ఆస్పత్రిపాలు కావడం దురదృష్టకరమన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని.. అటువంటి కార్యకర్తలు మృతిచెందడం బాధాకరమన్నారు. ఆ పార్టీకి తీరని లోటు అన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Pawan Kalyan- Kandukuru Incident
Pawan Kalyan

అయితే పవన్ ప్రకటనలో ఎక్కడా చంద్రబాబు పేరు ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల టీడీపీ, జనసేన మధ్య సానుకూల వాతవరణం ఉంది. రెండు పార్టీలు పరస్పరం గౌరవించుకుంటూ వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయన్న వార్తలు వస్తున్నాయి. అటు విశాఖలో ఘటనలో పవన్ ను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. విశాఖ నగరం నుంచి పవన్ ను బయటకు పంపించింది. ఆ సమయంలో పవన్ కు చంద్రబాబు స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రస్తావన లేకుండా పవన్ స్పందించడంపై భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయేసరికి చంద్రబాబు కూడా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. కన్నీటిపర్యంతమయ్యారు. అయితే పవన్ ప్రత్యక ప్రకటన విడుదల చేయడంతో టీడీపీకి స్వాంతన చేకూరినట్టయ్యింది. టీడీపీకి ఎదురైన ఈ ఘటనకు పవన్ స్పందించడంపై తెలుగుదేశం నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Pawan Kalyan- Kandukuru Incident
Pawan Kalyan- Kandukuru Incident

అయితే వైసీపీ నేతలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో వైఫల్యం కారణంగానే ఘటన చోటుచేసుకుంటున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఆ వివరాలు తెచ్చుకునే పనిలో ఉంది. అటు తరువాత కేసుల నమోదు చేసే చాన్స్ ఉంది. అయితే ఈ కష్టకాలంలో పవన్ స్పందించడం.. టీడీపీ కార్యకర్తల మృతి దురదృష్టకర ఘటనగా పేర్కొనడం విశేషం. అటు వైసీపీ సైతం విమర్శలు చేసే అవకాశముండడంతో పవన్ వ్యూహాత్మకంగా ఘటనపై స్పందించారని.. చంద్రబాబు ఊసెత్తకపోవడం సరైన చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper