Ye Maaya Chesave Sequel: టాలీవుడ్ లో లవ్ స్టోరీస్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన అతి తక్కువ సినిమాలలో ఒకటి ‘ఏ మాయ చేసావే’..నాగ చైతన్య మరియు సమంత హీరోహీరోయిన్లు గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ పరంగా మామూలు హిట్టే కానీ, టీవీ టెలికాస్ట్ లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది..సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఈ చిత్రానికి మరింత క్లాసిక్ స్టేటస్ వచ్చింది.

ఇది నాగ చైతన్య కి రెండవ సినిమా..సమంత కి మొదటి సినిమా..ఈ సినిమా తోనే సమంత స్టార్ హీరోయిన్ రేంజ్ స్టేటస్ ని దక్కించుకుంది..వెంటనే మహేష్ బాబు , ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..ఇక ఈ సినిమా తోనే సమంత – నాగ చైతన్య మధ్య ప్రేమ ఏర్పడింది..ఆ తర్వాత కొనేళ్లకు పెళ్లి చేసుకున్నారు..మధ్యలో విభేదాలు వచ్చి విడిపోయారు..ఇదంతా మనకి తెలిసిందే.
అయితే అలాంటి కల్ట్ స్టేటస్ దక్కించుకున్న ఈ సినిమాకి సీక్వెల్ తియ్యబోతున్నాడట డైరెక్టర్ గౌతమ్ మీనన్..ఈ సినిమాలో కూడా నాగ చైతన్య మరియు సమంత హీరో హీరోయిన్లు గా నటించబోతున్నట్టు తెలుస్తుంది..సమంత ని ఇందులో నటించడానికి ఒప్పించేందుకు గౌతమ్ మీనన్ చాలా కష్టపడ్డాడట..నాగ చైతన్య తో కలిసి చెయ్యలేను అని చెప్పినప్పటికీ కూడా ఆయన పట్టువదలలేదు..ఇక సమంత కూడా తనకి కెరీర్ ఇచ్చిన డైరెక్టర్ ఇంతలా బ్రతిమిలాడేసరికి ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట..అయితే ప్రస్తుతం సమంత తనకి సోకిన మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధిని నివారించుకొనుటకు శస్త్ర చికిత్స చేయించుకుంటుంది.

ఆ క్రమం లోనే ఆమె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుంది..సంక్రాంతి తర్వాత నుండి షూటింగ్స్ లో పాల్గొంటానని డేట్స్ కూడా ఇచ్చేసింది..ప్రస్తుతం ఆమె చేతిలో విజయ్ దేవరకొండ తో చేస్తున్న ‘ఖుషి’ చిత్రం తో పాటుగా, గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ మరియు ఒక బాలీవుడ్ వెబ్ సిరీస్ కూడా ఉంది..ఈ సినిమాలన్నీ పూర్తైన తర్వాతే ‘ఏం మాయ చేసావే’ మూవీ ప్రారంభం అవుతుందని టాక్.