Irfan Pathan- Janasena: ధోని హయాంలో వెలుగు వెలిగిన క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. తన ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలింగ్ తోపాటు బ్యాటింగ్ లోనూ పరుగులు సాధిస్తూ నికార్సైన ఆల్ రౌండర్ గా ఎదిగాడు. పాకిస్తాన్ పై ఓసారి హ్యాట్రిక్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి పలు ప్రమోషనల్ మ్యాచులు సహా ఈవెంట్లలో సందడి చేస్తున్నారు. ఇక ఇటీవల సౌత్ లో వచ్చిన విక్రమ్ మూవీ ‘కోబ్రా’లోనూ నటించాడు.

ఇక ఇర్ఫాన్ పఠాన్ తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లోని ఓ చారిటీ మ్యాచ్ కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా అభిమానులు ‘ఇర్ఫాన్.. ఇర్ఫాన్’ అంటూ గోల చేశారు.
Also Read: Balakrishna: రెస్టారెంట్ కు వెళ్లిన బాలయ్యలో మరో యాంగిల్ ఇదీ.. చూస్తారా?
ఇక తమ ఆరాధ్య సినీ హీరో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ పలువురు అభిమానులు ‘జై జనసేన’ అంటూ ఇర్ఫాన్ ముందర నినాదాలు చేశారు. తనకూ పవన్ కళ్యాణ్ తెలుసు అంటూ ఇర్ఫాన్ అభిమానులకు చేరువగా వచ్చిన ‘జై జనసేన’ అంటూ ప్రతిగా నినాదం చేశారు.

కొందరు అభిమానులు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది. ప్రముఖ క్రికెటర్లు కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ను అర్థం చేసుకున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:Atrocious in Nizamabad: తన వివాహేతర సుఖానికి అడ్డు వస్తుందని సొంత కూతురిని అలా చేసిన తల్లి