Balakrishna: నందమూరి బాలకృష్ణ తెరపై ఎంత సీరియస్ వేశాలు వేసినా.. ఆయన బయట మాత్రం చాలా చిన్నపిల్లాడులా ఉంటారని.. సరదాగా కలిసిపోతారని పేరుంది. కోపం వస్తే ఎవరని చూడకుండా చెంప పగుల కొడుతుంటారు. తాజాగా బాలయ్య తన తదుపరి చిత్రం షూటింగ్ కోసం ‘టర్కీ’ వెళ్లారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం కొన్ని రోజుల పాటు అక్కడ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే బాలయ్య బాబు అక్కడి ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ ఒక తెలుగు వారి కుటుంబం తారసపడడం.. బాలయ్యను గుర్తించడంతో వారితో కలిసి టిఫిన్ చేసి బాలయ్య సరదాగా ముచ్చటించారు. ‘హే భాయ్.. టిఫిన్ చేసేశా.. ఇప్పుడు మందులేసుకుంటాను.. ఏ పని లేకపోతే బుర్ర పిచ్చెక్కుతుంది. అందుకే తాను హీరోగా, ఎమ్మెల్యేగా, బసవతారకం ఆస్పత్రి చైర్మన్ గా బిజీగా ఉన్నాను’ అంటూ సరదాగా వారితో సంభాషణ కలిపారు.
అనంతరం అక్కడే ఉన్న ఆ కుటుంబంలోని మహిళను చూసి వీళ్లు ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూస్తూ మైండ్ పాడు చేసుకుంటారు.. టీవీ తక్కువ చూస్తేనే మెదడుకు మంచిది’ అంటూ ఆ మహిళపై సెటైర్ కూడా వేశాడు బాలయ్య.
బాలయ్య ఇలా ఓ కుటుంబంతో కలిసి సరదాగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసి బాలయ్య ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఎలాంటి గర్వం లేకుండా మా బాలయ్య ఇలా సామాన్యులతో ప్రవర్తించిన తీరు చూసి శభాష్ అంటూ కొనియాడుతున్నారు.
Also Read:Chiranjeevi- Nagababu: చిరంజీవి, నాగబాబు అడ్డంగా దొరికిపోయారట.. ఏమిటా కథ?
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ
[…] Also Read: Balakrishna: రెస్టారెంట్ కు వెళ్లిన బాలయ్యలో… […]
[…] Also Read: Balakrishna: రెస్టారెంట్ కు వెళ్లిన బాలయ్యలో… […]
[…] Also Read:Balakrishna: రెస్టారెంట్ కు వెళ్లిన బాలయ్యలో… […]