https://oktelugu.com/

భలే ఐడియా.. పాముకు మాస్క్.. చూశారా ?

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ మనుషులకే ఎక్కువగా సోకుతుంది. అయితే జంతువులు సైతం ఈ వైరస్ బారిన పడతాయని పలు పరిశోధనల్లో తేలింది. కుక్కలు, పిల్లులు కరోనా బారిన పడినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో కొందరు పెంచుకునే పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు, కుందేళ్లకు మాస్కులు పెడుతున్నారు. తాజాగా ఒక పాముల వాడు కూడా పాముకు మాస్క్ పెట్టాడు. పాములను ఆడించే వ్యక్తి తాను పాములపై ఆధారపడి జీవిస్తున్నానని పాముకు కరోనా సోకితే ఎలా…? […]

Written By: Kusuma Aggunna, Updated On : August 22, 2020 1:04 pm
Follow us on

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ మనుషులకే ఎక్కువగా సోకుతుంది. అయితే జంతువులు సైతం ఈ వైరస్ బారిన పడతాయని పలు పరిశోధనల్లో తేలింది. కుక్కలు, పిల్లులు కరోనా బారిన పడినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో కొందరు పెంచుకునే పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు, కుందేళ్లకు మాస్కులు పెడుతున్నారు. తాజాగా ఒక పాముల వాడు కూడా పాముకు మాస్క్ పెట్టాడు. పాములను ఆడించే వ్యక్తి తాను పాములపై ఆధారపడి జీవిస్తున్నానని పాముకు కరోనా సోకితే ఎలా…? అని ప్రశ్నిస్తున్నాడు.

Also Read : కారులో మంటలు.. పక్కనే ఫైర్ ఇంజిన్.. క్షణాల్లో!

పాముకు మాస్క్ కట్టి తాను ప్రేమగా పెంచుకునే పాముకు కరోనా రాదని ఆ వ్యక్తి గర్వంగా చెప్పుకుంటున్నాడు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగులో ఈ ఘటన చోటు చేసుకుంది. పామును ప్రేమగా ఆడించి, పెంచుకుంటున్న ఆ వ్యక్తి పేరు గంగారం. ఆ వ్యక్తి పాములాట ఆడించే సమయంలో చుట్టూ గుమికూడే వ్యక్తులు మాస్క్ ను ధరించడం లేదు. పాములాట చూడటానికి వచ్చిన వ్యక్తులకు మాస్కులు పెట్టుకోండని సూచించినా వారు మాట వినడం లేదని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.

వాళ్లు మాస్కులు పెట్టుకోక పోవడం వల్ల పామును ఆడించడం మానేస్తే జీవనం సాగించడం కష్టం. దీంతో పాముకే మాస్క్ కట్టేస్తే ఎటువంటి సమస్య ఉండదని ఆ వ్యక్తి భావించాడు. మాస్క్ కట్టిన బుజ్జిపాముకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మాస్క్ తో ఉన్న పామును చాలామంది విచిత్రంగా చూస్తుంటే కొంతమంది మాత్రం పామును ఆడించే వ్యక్తి తెలివిని ప్రశంసిస్తున్నారు. మాస్క్ తో ఉన్న పామును చూడటానికి ఎక్కువమంది వస్తున్నారని గంగారాం కూడా సంబరపడిపోతున్నాడు.

Also Read : వామ్మో.. సింహాల మలానికి ఇంత డిమాండా?