https://oktelugu.com/

కారులో మంటలు.. పక్కనే ఫైర్ ఇంజిన్.. క్షణాల్లో!

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో మెజారిటీ ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు కాగా మరికొన్ని ప్రమాదాలు ఊహించని విధంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రమాదం జరిగినా కొన్ని సందర్భాల్లో అదృష్టం ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. తాజాగా ఒక వ్యక్తి ఊహించని విధంగా ఎదురైన ప్రమాదాన్ని తన తెలివితేటలతో పరిష్కరించాడు. Also Read : బిగ్ స్కామ్: 18 నెలల్లో 8మందికి జన్మనిచ్చిన 65 ఏళ్ల మహిళ! ప్రస్తుతం సోషల్ మీడియాలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 22, 2020 / 12:56 PM IST
    Follow us on

    ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో మెజారిటీ ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు కాగా మరికొన్ని ప్రమాదాలు ఊహించని విధంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రమాదం జరిగినా కొన్ని సందర్భాల్లో అదృష్టం ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. తాజాగా ఒక వ్యక్తి ఊహించని విధంగా ఎదురైన ప్రమాదాన్ని తన తెలివితేటలతో పరిష్కరించాడు.

    Also Read : బిగ్ స్కామ్: 18 నెలల్లో 8మందికి జన్మనిచ్చిన 65 ఏళ్ల మహిళ!

    ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యక్తికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ వ్యక్తి కారులో నుంచి మంటలు వచ్చాయి. కారులో మంటలు వస్తే ఎవరైనా భయాందోళనకు గురవుతారు. అయితే ఆ వ్యక్తికి మాత్రం అదే సమయంలో పక్కనే ఉన్న ఫైర్ ఇంజన్ కనిపించింది. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పవచ్చని ఆలోచించి వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయం కోరాడు.

    అగ్నిమాపక సిబ్బంది వెంటనే సదరు వ్యక్తి కారును పైపుల సహాయంతో ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ ఇంజిన్ పక్కనే ఉండటంతో ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఎన్ని నక్క తోకలు తొక్కితే ఇలాంటి అదృష్టం వస్తుందంటూ సదరు వ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అదృష్టం ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఏం కాదని ఈ వ్యక్తికి చూస్తే అర్థమవుతోంది.

    Also Read : భలే ఐడియా.. పాముకు మాస్క్.. చూశారా ?