Sadguru Samantha: ‘మట్టిని రక్షించు’ పేరిట ప్రముఖ ఆధ్యాత్మిక గురు జగ్జీ వాసుదేవ్ , రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సినీ నటి సమంత తదితరులు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సమంతతో సద్గురు ఇంటర్వ్యూ అందరినీ అలరించింది. సమంత ఇటీవలే నాగచైతన్యతో విడాకులు తీసుకొని ఎంతగా బాధపడిందో అందరికీ తెలిసిందే. ఆ బాధను మరిచిపోవడానికే వరుసగా సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంటోంది.

ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ‘ఇగో’కు సంబంధించిన చర్చ వచ్చింది. ‘ఇగో కారణంగానే ఇద్దరి మధ్య సంబంధాలు నాశనం అవుతాయని ’ సద్గురు కీలక వ్యాఖ్యలు చేశారు. సమంతకు జ్ఞానోదయం అయ్యేలా సద్గురు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలకు ఏకీభవించిన సమంత నవ్వుతూనే వాటిని పాజిటివ్ గా తీసుకోవడం విశేషం.
సద్గురు ‘ఇగో’యిస్టుల గురించి మాట్లాడుతూ.. ‘ప్రపంచం ఎప్పుడూ అందరితో ఫెయిర్ గా ఉండదని.. అందరూ మనతో బాగుండాలి అని కోరుకోకూడదు’ అని సమంతకు హితబోధన చేశాడు. సంతోషకరమైన జీవితం కావాలనే కోరుకోవాలని సూచించారు. తాను ఆధ్యాత్మిక కేంద్రాల్లో కంటే 65 శాతం మంది మంచి వాళ్లను బయటే చూశానంటూ సమంతకు ధైర్యం నూరిపోశారు.
సమంత వ్యక్తిగత జీవితాన్ని అన్వయించి సద్గురు ఆమెకు ఈ సూచనలు చేసినట్టు అర్థమవుతోంది. ఆ ఇగో యిస్టు ఎవరని అందరూ ఆరాతీస్తుంటే.. అది సమంత విడాకులు ఇచ్చిన ‘నాగచైతన్క్ష్’ అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. విడిపోయినా కానీ సంతోషంగా ఉండాలంటే ముందుగా ఈ ప్రపంచం గురించి ఆలోచించవద్దని.. సంతోషకరమైన జీవితం కోసం పాటుపడాలని సద్గురు తాజాగా సమంతకు పలు కీలక సూచనలు చేశారు.
ఎవరికైనా సరే నచ్చిన జీవితాన్ని అనుభవించే హక్కు ఉంటుందని సమంత విడాకులకు పరోక్ష మద్దతునిచ్చాడు సద్గురు. అప్పుడే జీవితం బాగుంటుందని భరోసానిచ్చాడు. ఏం చేయాలో తోచనప్పుడే ముక్తి అనే దానికి మీదకు మనసు మళ్లుతుందని.. ఆకలి ఉంటే కేవలం కడుపునింపుకోవడమే సమస్య అని పేర్కొన్నారు.