Jack Doherty : ప్రముఖ యూట్యూబర్ జాక్ డోహెర్టీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు, లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం తన వీడియోలతో అభిమానులతో టచ్ లో ఉంటాడు. తను వీడియోల కోసం ఎంతటి సాహసానికైనా తెగబడతాడు. తాజాగా మరోసారి అలాంటిదే చేసి ప్రాణాల పైకి తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో అతడు తన 300,000డాలర్ల విలువైన మెక్‌లారెన్ కారును క్రాష్ చేశాడు. ఈ ప్రమాదంలో అతడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. తన ముఖం అంతా రక్తసిక్తమైంది. ఈ 20 ఏళ్ల యువకుడు ఈ ప్రమాదాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలనుకున్నాడు. వారు సూపర్ కారులో ప్రయాణిస్తుండగా కుండపోత వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో వారు సూపర్‌కార్‌పై నియంత్రణ కోల్పోయారు. దాంతో ముందున్న డివైడర్ ను ఢీకొట్టారు. ఆ సమయంలో కారును అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తూ.. ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ తన ఫోన్‌ని చూస్తున్నాడు. మెక్‌లారెన్ 570ఎస్ కారు తడిగా ఉన్న మియామీ రహదారిపై అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న మెటల్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం నుజ్జు నజ్జు అయింది. ప్రమాదం నుంచి జాక్ క్షేమంగా తప్పించుకోగలిగాడు, కానీ ప్రయాణీకుల సీటులో కూర్చున్న అతని స్నేహితుడు మైఖేల్ డేవిడ్ ముఖం మొత్తం రక్తసిక్తమైంది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వెంటనే చేరుకున్న పోలీసులు
యువ మిలియనీర్ అయిన జాక్ డోహెర్టీ దాదాపు 3లక్షల డాలర్ల విలువ చేసే మెక్‌లారెన్ కారును మెటల్ డివైడర్ తో ఢీకొట్టడంతో జనాలు గుమిగూడారు. ఈ ప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే బాటసారులు, స్థానిక అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగినంత సేపు వారు వీడియో రికార్డు చేస్తూనే ఉన్నారు. జాక్ డోహెర్టీ తన కెమెరామెన్‌తో పాటు డ్రైవర్ సీటులో తన ఫోన్‌లో బిజీగా ఉన్నాడు. అప్పుడు కెమెరా ముందుకు ఫోకస్ చేస్తుంది. జాక్ ప్రమాదం జరిగే ముందు కుడివైపునకు వెళ్లే చివరి క్షణాలు రికార్డు అయ్యాయి. ప్రమాదం తర్వాత ఆస్పత్రికి ఫోన్ చేసే బదులు జాక్ తన ఫోన్‌లో తర్వాత పరిణామాలను చిత్రీకరిస్తూనే ఉన్నాడు.
జాక్ డోహెర్టీ కార్ల కలెక్షన్స్
జాక్ డోహెర్టీ యూట్యూబ్‌లో చాలా ఫేమస్. అతడు ప్రమాదకరమైన వీడియోలకు ప్రసిద్ధి. ఈ వీడియోల ద్వారా అతడు దాదాపు 60మిలియన్ డాలర్లు సంపాదించాడు. అతడికి విలాసవంతమైన సూపర్ కార్లు చాలా ఉన్నాయి. తన సోషల్ మీడియా ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో ఆ కార్ల వివరాలను పంచుకున్నారు. వాటిలో దాదాపు కోటి రూపాయల విలువైన ఫ్లాష్ స్పోర్ట్స్ 570GT మోడల్ కారు ఉంది. ఇది గంటకు 150కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. వాస్తవానికి అతడి కార్ల సేకరణలో ఇదే చాలా చౌక. ఇది కోటీ పది లక్షల టెస్లా మోడల్ ఎక్స్, 2కోట్ల 50లక్షల లంబోర్ఘిని హురాకాన్ కూడా ఉంది.
200కిమీ వేగం
లాంబో, మెక్‌లారెన్ కార్లు గంటకు 200కిమీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. అతనికి ఇష్టమైన లేత నీలం రంగులో మెక్‌లారెన్ చివరిది. కారు బాడీవర్క్ కస్టమైజేషన్ చేయించుకున్నాడు. అతడి కార్ల సేకరణ విలువే దాదాపు ఒకమిలియన్ అమెరికా డాలర్లు ఉంటుంది. ఈ కారులోపల చాలా విలాసవంతంగా ఉంటుది. ప్రైవేట్ జెట్ ఎయిర్‌లైన్ తరహా వాలు కుర్చీలు, పెద్ద ఎంటర్ టైన్ మెంట్ స్క్రీన్‌లు , వైఫై సౌకర్యం ఉంటుంది.