Google Offer: గూగుల్ కంపెనీ ఎల్లప్పుడూ ఆకర్షణీయమైన ఉద్యోగ ఆఫర్‌లను అందించడంలో ముందుంటుంది. అయితే తాజాగా ఆ సంస్థకు చెందిన ఓ ఆఫర్ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టైర్ 3 కాలేజీకి చెందిన కంప్యూటర్ సైన్స్ నేపథ్యం లేని వ్యక్తికి గూగుల్ నుంచి ఏడాదికి రూ.1.64కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం రావడం ప్రజలను ఆశ్చర్యపరిచింది. సిలికాన్ సిటీ బెంగళూరులో టైర్ 3 కాలేజీకి చెందిన ఓ యువకుడు గూగుల్‌లో భారీ ప్యాకేజీతో జాబ్ ఆఫర్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏడాదికి రూ.65 లక్షల వేతనంతో ఉద్యోగం దక్కించుకోవడంతో సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఎందుకంటే.. ప్రతిష్టాత్మక సంస్థల నుంచి వచ్చే గ్రాడ్యుయేట్లు మాత్రమే కాకుండా ఏ మాత్రం గుర్తింపు లేనటువంటి సాదాసీదా కాలేజీలో చదివిన యువకుడికి ఇంత పెద్ద మొత్తంతో ఇలాంటి అవకాశం దొరకడం ప్రతి ఒక్కరినీ షాక్ కు గురిచేస్తుంది. జేపీ మోర్గాన్‌లో డెవలపర్ అయిన కార్తీక్ జోలపారా పదేళ్ల వర్క్ ఎక్స్ పీరియన్స్‌తో గూగుల్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సెలక్ట్ అయ్యాడు. తన జాబ్ ఆఫర్ కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియా వేదిక అయిన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో అది కాస్తా నెట్టింట్లో వైరల్ అవుతుంది. కార్తీక్ జోలపారా ఆ వ్యక్తి ప్రొఫైల్‌ను చూసి, జాబ్ ఆఫర్‌ని చాలా ఆసక్తికరంగా భావించి దానిని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో షేర్ చేశాడు.
రూ. 1.64 కోట్ల వార్షిక ప్యాకేజీ
ఎక్స్‌లో ఈ ఆఫర్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ కార్తీక్ జోలపారా “క్రేజీ ఆఫర్” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది టెక్ ఫీల్డ్‌లో ఫ్లడ్ ఆఫ్ రియాక్షన్స్ కు దారితీసిందని తెలిపారు. ఈ ఆఫర్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్థానానికి రూ. 65 లక్షల వార్షిక వేతనం ప్యాకేజీని పేర్కొన్నారు. దీంతోపాటు వార్షిక బోనస్ రూ.9 లక్షలు, సిగ్నేచర్ బోనస్ రూ.19 లక్షలు, రీలోకేషన్ బోనస్ రూ.5 లక్షలు కూడా చేర్చారు. ఓవరాల్ గా తొలి ఏడాది రూ.1.64 కోట్ల ప్యాకేజీ పెద్ద ఆకర్షణగా నిలిచింది. అయితే, ఈ ఇంజనీర్ ఎటువంటి అధికారిక కంప్యూటర్ సైన్స్ డిగ్రీ లేకుండా టైర్ 3 ఇన్స్టిట్యూట్ నుండి పట్టాపొందాడు.
సోషల్ మీడియాలో యూజర్ రియాక్షన్
ఇతని ఆఫర్ లెటర్ చూసిన నెటిజన్లు అంతా ఒకింత షాక్‌కు గురవుతున్నారు. ఎందుకంటే.. కార్తీక్‌కు కనీనసం కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పట్టా కూడా లేదు. టైర్ 3 కాలేజీ నుంచి సాదాసీదా గ్రాడ్యుయేట్ అయిన అభ్యర్థి.. అలాంటి ఆయనకు అత్యంత ఆకర్షణీయమైన వార్షిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్ రావడం వింతగా అనిపిస్తుంది. దీంతో టెక్ పరిశ్రమ జీతాలు, నియామక పద్ధతుల గురించి నెట్టింట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
అంతేకాదు కార్తీక్ ఆఫర్ లెటర్‌లో ఏడాదికి రూ. 65 లక్షల జీతంతో పాటు, రూ. 9 లక్షల వార్షిక బోనస్, రూ. 19 లక్షల సిగ్నేచర్ బోనస్, రూ. 5 లక్షల రీలొకేషన్ బోనస్ కూడా అతడికి లభించనున్నాయి. మొత్తంగా ఏడాదికి రూ. 1.64 కోట్లు అందుకుంటారు. కార్తీక్ జోలపారా తన పోస్ట్‌కి ‘క్రేజీ ఆఫర్స్’ అనే క్యాప్షన్ తో పోస్టు చేశాడు. ఇక దీనిని చూసిన నెటిజన్లు భారతీయ జాబ్ మార్కెట్‌లో మారుతున్న డైనమిక్స్ గురించి చర్చలకు తెరలేపారు.
కంప్యూటర సైన్స్ నేపథ్యం లేని టైర్ 3 కాలేజీ గ్రాడ్యుయేట్ ఇంత భారీ ప్యాకేజీతో జాబ్ ఆఫర్ అందుకోవడం నిజంగా చాలా చాలా గ్రేట్, ‘ఆరు నుంచి ఎనిమిదేళ్ల పాటు ఎక్స్ పీరియన్స్ ఉన్నవారికి ఇలాంటి ఆఫర్లు వస్తున్నాయి’, ‘గూగుల్ ఇలాంటి క్రేజ్ ఆఫర్స్ ఇస్తుంటే నేను కూడా నా రెజ్యూమ్ కి పాలిష్ చేస్తాను’.. అంటూ నెటిజన్లు ఒక్కొక్కరు తమదైన శైలిలో కామెంట్ సెక్షన్‌లో తమ రియాక్షన్లను తెలుపుతున్నారు.
కొంత మంది యూజర్లు సోషల్ మీడియాలో ఈ ఆఫర్‌ను అభినందిస్తున్నప్పటికీ, కొంతమంది వినియోగదారులు దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇలాంటి అనుభవం ఉండి ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారిని నేను చాలా మందిని చూశాను అని ఒక యూజర్ అన్నాడు.