Comedian Tear Story : అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఫేట్ ఒక్కరోజులో మారిపోవచ్చు. మనం చేయాల్సిందల్లా మనకు అప్పగించిన పనిని మనం సమర్థంగా చేయడమే.. రాజకీయ నాయకులైనా.. సినిమా ప్రముఖులైనా ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగినవారే.. టాలీవుడ్ లో చిరంజీవి, మోహన్ బాబు నుంచి నేటి నాని వరకూ స్వయంకృషితో పైకొచ్చిన వారే. వీరే కాదు.. టాలీవుడ్ లో మెరిసిన ఎందరో నటులది ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర..

తెలుగు బుల్లితెర ద్వారా ఫేమస్ అయిన ఎందరో కమెడియన్స్ ఒకప్పుడు చాలా కష్టపడ్డవారే. ముఖ్యంగా జబర్ధస్త్ తో ఎదిగిన వారిది ఒక్కొక్కరిది ఒక్కో కష్టాల గాథ. తినడానికి తిండి లేని స్టేజీ నుంచి ఇప్పుడు టాలీవుడ్ లో ఒక మంచి కమెడియన్ గా ఎదిగే వరకూ సాగారు.
జబర్ధస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని వెండితెరపై కూడా అవకాశాలు సంపాదించుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో గెటప్ శీను, సుడిగాలి సుధీర్, మహేష్ లాంటి వారు ఉన్నారు.
ప్రస్తుతం బుల్లితెరపై జబర్ధస్త్ లో వారి కామెడీ పంచ్లతో నవ్విస్తున్న ఎంతో మంది కమెడియన్ లు ఒకప్పుడు పూట తిండికి లేక చాలా అవస్థలు పడ్డారు.కుప్పిగంతలు వేసినవారే.
జబర్ధస్త్ ద్వారా పైకి ఎదిగిన కమెడియన్ వేణు, ప్రస్తుతం సినిమాలతోపాటు ‘స్టార్ కమెడియన్స్’ షో చేస్తూ అలరిస్తున్నాడు. మొదట్లో బాగా కామెడీ చేస్తూ పంచులు వేస్తూ నవ్వించిన వేణు జబర్ధస్త్ కు దూరమయ్యాడు. ఇప్పుడు సినిమాలు, ఇతర కార్యక్రమాలు చేస్తున్నాడు.
ఇండస్ట్రీకి రాకముందు వేణు చాలా కష్టాలు పడ్డాడట.. హైదరాబాద్ కు వచ్చి సెట్ బాయ్ గా కూడా చేశాడు. అతడికి దానికిగాను రూ.70 ఇచ్చేవారట.. అనంతరం కొంతమంది దర్శకుల దగ్గర వేణు పనిచేశాడట.. వాళ్ల బాత్రూమ్ లు కడుగడమే కాకుండా వాళ్లు తిన్న కంచాలు కూడా కడిగానని వేణు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ చివరకు జబర్ధస్త్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.