RRR Movie: బాహుబలితో తెలుగు సినీ పరిశ్రమను జాతీయ స్థాయిలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా వేరే స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. ఇదే జోరుతో మరో భారీ హిట్ కొట్టేందుకు ఆర్ఆర్ఆర్తో సిద్ధమవుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఇందులో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలు, సాంగ్స్ సినిమాపై అంచనాలు తారస్థాయికి పెంచుతున్నాయి. మరోవైపు, ఇటీవలే చెర్రి, తారక్‌లు కలిసి స్టెప్పులేస్తున్న ఓ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరు కలిసి డాన్స్ చేసే ఆ సన్నివేశాన్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే జోరును కొనసాగిస్తూ.. ఈ రోజు ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం.
నా పాట సూడు.. నాటు నాటు నాటు అంటూ సాగుతూ.. బీట్ అదరిపోయింది. ఈ సాంగ్‌కు చంద్రబోస్ రచనలు అందించారు. ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు అందించారు. పూర్తి పాటను నవంబరు 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, మరోవైపు, శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్న వేళ.. అదే జోషుతో ప్రమోషన్స్‌తో సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెంచుతోంది చిత్రబృందం. ఇటీవల విడుదలైన టీజర్‌తో అది క్లియల్ అయ్యింది. కాగా, ఇందులో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆలియా భట్ సీత పాత్రలో అలరించనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది చిత్రబృందం.
మరోవైపు, ఆచార్య సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు రామ్‌చరణ్. తాజాగా, రామ్‌చరణ్, పూజా హెగ్డెల ప్రేమపై చిత్రీకరించిన పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటకు నెట్టింట క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.