Actor Sri Vishnu: సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా స్వతహాగా కష్టపడి విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను పలకరించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు. ఇటీవలే కాలంలో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన రాజరాజ చోర్ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జోరుతోనే వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇలా ఆయన చేస్తున్న పలు ఆసక్తికర ప్రాజెక్టుల్లో దర్శకుడు తేజ మర్ని కాంబోలో తెరకెక్కిన సినిమా అర్జున పల్గుణ. సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేస్తూ వచ్చింది. తాజాగా, విడుదలైన ఈ సినిమా టీజర్ ఆ అంచనాలను వేరే రేంజ్‌కు తీసుకెళ్లాయి.
టీజర్ స్టార్టింగ్‌లోనే ఆసక్తికర డైలాగ్‌తో మొదలై.. మెల్లగా ఇంటెన్స్ మోడ్‌లోకి తీసుకెళ్లింది. ఇప్పటి వరకు శ్రీ విష్ణు చేసిన సినిమాలకంటే ఈ సినిమాలో అతని పాత్ర భిన్నంగా ఉండబోతోందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. కాగా, ఇందులో అమృత, జబర్దస్త్ మహేశ్, సుబ్బరాజు పలువురు కీలక పాత్రలు పోషించినట్లు టీజర్లో తెలుస్తోంది.