
Chiranjeevi Disaster Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న క్రేజ్ మామూలిది కాదు. మెగాస్టార్ మూవీస్ అంటే చూడని వారుండరు. ఒకప్పుడు ఆయన సినిమా ప్రారంభం నుంచి విడుదలయ్యే వరకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూసేశారు. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత చాలా మంది నిరాశ చెందారు. కానీ రీ ఎంట్రీ ఇచ్చి ‘ఖైదీ నెంబర్ 150’తో ప్రేక్షకుల్లో ఊపు పెంచాడు. ఈ నేపథ్యంలో ఆయన తీసే ప్రతీ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలకు అనుగుణంగా సినిమాలు రాలేదని ఇండస్ట్రీలో చర్చ సాగుతుంది. సైరా నరసింహారెడ్డి, ఆచార్య ఇలా పలు సినిమాలు ఎంతో హిట్ గా నిలుస్తాయని అనుకున్న తరుణంలో చిరంజీవి కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. ఇవే కాకుండా మెగాస్టార్ ఫిల్మ్ కెరీర్లో ఎంతో హోప్స్ పెట్టుకోగా ప్లాప్ గా మిగలిని సినిమాలు ఏవో చూద్దాం.
స్టువర్టుపురం పోలీస్ స్టేషన్:
మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. 1991లో రిలీజైన ఈ మూవీని యండమూరి వీరేంద్రనాథ్ రచించిన కథ ఆధారంగా ఆయనే డైరెక్షన్ వహించారు. శతర్ కుమార్ ఇందులో ప్రధాన విలన్. అప్పట్లో పోలీస్ పాత్రలకు క్రేజీగా ఉండడంతో ఇందులో చిరంజీవి ఎస్ ఐగా కనిపించి ఆకట్టుకున్నారు. కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.
త్రినేత్రుడు:
ఎ .కోదండారామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా 1988లో రిలీజైంది. ఇందులో చిరంజీవికి జోడిగా భానుప్రియ నటించారు. ఇది చిరంజీవికి 100వ చిత్రం. 1984లో వచ్చిన ఇంగ్లీస్ మూవీ బెవర్లీ హిల్స్ కాప్ అనే చిత్రం ఆధారంగా నిర్మించారు. అయితే ఈ సినిమా చిరంజీవి కెరర్లో బెస్ట్ మూవీ అవుతుందని అనుకున్నారు. కానీ డిజాస్టర్ గా మిగిలింది.
జేబుదొంగ:
1987లో రిలీజైనీ ఈ మూవీలో భానుప్రియతో పాటు రాధలు నటించారు. రోజా మూవీస్ పతాకంపై ఎం. అర్జునరాజు, ఎం. రామలింగరాజులు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ఎస్పీ పరుశురాం:
రవిరాజా పినిశెట్టి హవా నడుస్తున్న కాలంలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా తీశారు. అదే ఎస్పీ పరుశురాం. 1994లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవితో శ్రీదేవి కలిసి నటించారు. శ్రీదేవి హీరోయిన్ గా చేసిన చివరి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమా అంచనాలు తారుమారు చేసి ప్లాప్ మూవీగా నిలిచింది.
మృగరాజు:
చిరంజీవి కొత్త కథతో వస్తున్నారన్న ప్రచారం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో మృగరాజు సినిమా కోసం ఎదురుచూశారు. అయితే 2001లో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో చిరంజీవి తో పాటు సిమ్రన్ నటించారు. ఈ సినిమాతో పాటు దేవిపుత్రుడు, నరసింహనాయుడు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. అవి హిట్టు కొట్టగా చిరంజీవి సినిమా ప్లాప్ గా నిలిచింది.
అంజి:
భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చిన అంజి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమా రిలీజైన మరుసటి రోజు నుంచి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కోడిరామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో నమ్రతా శిరోద్కర్ హీరోయిన్.

శంకర్ దాదా జిందాబాద్:
ప్రభుదేవా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాపై హోప్స్ చాలా పెట్టుకున్నారు. అంతకుముందు తీసిని శంకర్ దాదా ఎంబీబీఎస్ సక్సెస్ కావడంతో దీనిని ఆదరిస్తారని అనుకున్నారు. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. మరోవైపు ఈ సినిమాతో పులిస్టాఫ్ పెట్టి ఆయన రాజకీయాల్లోకి ఎంట్రి ఇచ్చారు. ఆ తరువాత ‘ఖైదీనెంబర్ 150’తో రీ ఎంట్రీ ఇచ్చారు.
సైరా నరసింహారెడ్డి:
భారీ బడ్జెట్ తో రూపొందించిన సైరా నరసింహారెడ్డి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి విభిన్న గెటప్ లో కనిపించిన ప్రేక్షకులు ఆదరించలేదు. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని చిరంజీవి కుమారుడు చరణ్ నిర్మించగా ఆయనకు రూ.30 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది.
ఆచార్య:
వరుస విజయాల డైరెక్టర్ గా పేరున్న కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో ప్రయోగాత్మకంగా ‘ఆచార్య’ను తీశారు.అ యితే ఈ సినిమా భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. అప్పటి వరకు ఫ్యాన్ష్ ఎంతో హోప్ పెట్టుకోగా ఈ సినిమా ను చూసి తీవ్ర నిరాశ చెందారు.
ఇవే కాకుండా లంకేశ్వరుడు, రాజావిక్రమార్క, యుద్ధభూమి, చాణక్య శపథం లాంటి సినిమాలు చిరంజివి కెరీర్లో భారీ డిజాస్టర్ గా మిగిలాయి.