https://oktelugu.com/

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ తీగలాగితే హీరోల డొంక కదలనుందా?

Mythri Movie Makers: ఐదు రోజుల పాటు మైత్రీ మూవీ మేకర్స్ మీద ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రీ నిర్మాణ సంస్థ భాగస్వాములుగా నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దర్శకుడు సుకుమార్ ని టార్గెట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ లావాదేవీల్లో సుకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారని అధికారుల అనుమానం. వీరి ఉద్యోగులు, మైత్రీతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర సంస్థల మీద కూడా దాడులు జరిగాయి. వారి అకౌంట్స్, డాక్యుమెంట్స్ పరిశీలించారు. […]

Written By:
  • Shiva
  • , Updated On : April 24, 2023 / 11:38 AM IST
    Follow us on

    Mythri Movie Makers

    Mythri Movie Makers: ఐదు రోజుల పాటు మైత్రీ మూవీ మేకర్స్ మీద ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రీ నిర్మాణ సంస్థ భాగస్వాములుగా నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దర్శకుడు సుకుమార్ ని టార్గెట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ లావాదేవీల్లో సుకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారని అధికారుల అనుమానం. వీరి ఉద్యోగులు, మైత్రీతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర సంస్థల మీద కూడా దాడులు జరిగాయి. వారి అకౌంట్స్, డాక్యుమెంట్స్ పరిశీలించారు. విదేశాల నుండి మైత్రీ మూవీ మేకర్స్ తీసుకొస్తున్న నిధులు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

    ఇది హై ప్రొఫైల్ కేసు. దీంతో వివరాలు అధికారులు వెల్లడించడం లేదు. సాధారణంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై దాడులు జరిగితే దొరికిన నల్లధనం, ఆస్తుల వివరాలు బయటపెడతారు. ఐదు రోజులుగా జరిగిన దాడుల్లో ఏం గుర్తించారు అనేది స్పష్టంగా తెలియదు. అయితే సూచాయిగా కొన్ని విషయాలు పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు సుకుమార్ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు సమాచారం.

    Mythri Movie Makers

    హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆస్తుల కొనుగోళ్లకు పాల్పడ్డారు. అయితే నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి వాట్సప్ ఛాట్ కీలకంగా మారిందన్న షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. తమ చిత్రాల్లో నటిస్తున్న, నటించిన హీరోలకు చెల్లించిన అమౌంట్స్ కి సంబంధించిన ఛాట్ హిస్టరీ అలానే ఉందట. అది డిలీట్ చేయలేదట. ఎలాంటి రికార్డు లేకుండా బ్లాక్ లో చెల్లించిన నేపథ్యంలో గుర్తు కోసం ఛాట్ హిస్టరీ అలానే ఉంచుకున్నారట. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోలకు ఐటీ సెగ తగిలే ఆస్కారం కలదంటున్నారు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది.

    ఐటీ దాడులు మొదలయ్యాక నవీన్ ఎర్నేని ఆసుపత్రి పాలయ్యారు. దర్శకుడు సుకుమార్ అన్ని పనులు పక్కన పెట్టి సైలెంట్ అయ్యారు. 2015లో మైత్రీ మూవీ మేకర్స్ పరిశ్రమలో అడుగు పెట్టింది. ఈ సంస్థ మొదటి చిత్రం శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్. జనతా గ్యారేజ్, రంగస్థలం చిత్ర విజయాలతో టాప్ పొజిషన్ కి దూసుకొచ్చారు. ప్రస్తుతం పుష్ప 2, ఉస్తాద్ భగత్ సింగ్, ఖుషి చిత్రాలు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ 31, రామ్ చరణ్-బుచ్చిబాబు చిత్రాలు ప్రకటించారు.