Actor Shivaji: ముందు మనిషిగా మారు, నీతులు చెప్పడం కాదు… ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తూ స్టార్స్ పై శివాజీ షాకింగ్ ఆరోపణలు!

Actor Shivaji: చిత్ర పరిశ్రమకు దూరమైన శివాజీ పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయన ఓ పొలిటికల్ పార్టీ సానుభూతిపరుడిగా ఉన్నారు. ఈ మధ్య ఆ పార్టీతో దూరం పాటిస్తున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి కూడా కొన్ని ఉచిత సలహాలు ఇచ్చారు. ఆయన తన వద్ద ఉన్న అస్త్రాలు ఉపయోగించడం లేదు. తన బలమేమిటో తెలుసుకొని జనాల్లోకి వచ్చిన రోజు సీఎం సీటు సొంతం అవుతుంది. సీఎం జగన్ […]

Written By: Shiva, Updated On : April 24, 2023 11:29 am
Follow us on

Actor Shivaji

Actor Shivaji: చిత్ర పరిశ్రమకు దూరమైన శివాజీ పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయన ఓ పొలిటికల్ పార్టీ సానుభూతిపరుడిగా ఉన్నారు. ఈ మధ్య ఆ పార్టీతో దూరం పాటిస్తున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి కూడా కొన్ని ఉచిత సలహాలు ఇచ్చారు. ఆయన తన వద్ద ఉన్న అస్త్రాలు ఉపయోగించడం లేదు. తన బలమేమిటో తెలుసుకొని జనాల్లోకి వచ్చిన రోజు సీఎం సీటు సొంతం అవుతుంది. సీఎం జగన్ కి ఉన్న పట్టుదల పవన్ కళ్యాణ్ లో లేదు. ఆయన గట్టిగా అనుకోవడం లేదు. అనుకుంటే అయిపోతుంది. ఎందుకు అనుకోవడం లేదో తెలియడం లేదన్నారు.

పరోక్షంగా పొత్తులు లేకుండా ప్రజా పోరాటం చేయండి. మీపై, పార్టీపై ప్రజల్లో నమ్మకం ఉందని శివాజీ(Shivaji) చెప్పే ప్రయత్నం చేశారు. ఈసారి శివాజీ టాలీవుడ్ స్టార్ హీరోలను టార్గెట్ చేశారు. పేరు చెప్పకుండా ఓ హీరోపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ తో రిలేషన్ గురించి ఓపెన్ గా మాట్లాడాడు. ఒకప్పుడు పరిశ్రమలో హీరోల పక్కన చేరి గిట్టని వారి గురించి చెడు చెప్పేవాళ్ళు ఉండేవారు. ఇప్పుడున్న హీరోలు చాలా స్మార్ట్. ఎవరిని ఎక్కడ పెట్టాలో వాళ్లకు తెలుసని శివాజీ అన్నారు.

Actor Shivaji

ఆది సినిమా వరకు ఎన్టీఆర్(NTR) తో నాకు సాన్నిహిత్యం ఉండేది. కనిపిస్తే మాట్లాడుకునే చనువు ఉండేది. ఒక వ్యక్తి మా మధ్య దూరం పెరిగేలా చేశాడని నా అనుమానం. ఇప్పుడు ఎన్టీఆర్ తో టచ్ లేదు. ఓ పెద్ద హీరో తండ్రి మరణిస్తే పరామర్శించడానికి ఇంటికి వెళ్ళాను. హగ్ చేసుకునేందుకు ప్రయత్నం చేశాను. ఆ హీరో నా చేతులు వెనక్కి నెట్టారు. అక్కడ స్టేటస్ అడ్డం వచ్చిందనిపించింది. మళ్ళీ ఆధ్యాత్మిక మాటలు చెబుతుంటాడు. ముందు మనిషిగా మారు… అని శివాజీ ఫైర్ అయ్యాడు.

శివాజీ కెరీర్ బిగినింగ్ లో ఎడిటర్ గా, యాంకర్ గా చేశారు. అదే సమయంలో నటుడిగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు. సపోర్టింగ్ రోల్స్ చేసే శివాజీ హీరోగా ఎదిగారు. శివాజీ హీరోగా తెరకెక్కిన అమ్మాయి బాగుంది, మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలువురు హీరోలకు గాత్రదానం చేశారు. చిత్ర పరిశ్రమకు దూరమయ్యాక అమెరికాలో ఎక్కువగా ఉంటున్నాడు.