https://oktelugu.com/

Guntur: యువతులతో నగ్న పూజలు.. లక్ష ఇస్తామని బట్టలిప్పి ఆ పనిచేయించారు..!

అరవింద వారిని పూజారి నాగేశ్వరరావు వద్దకు తీసుకెళ్లింది. వారితో పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి, అతని అనుచరులు యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 15, 2023 / 05:13 PM IST

    Guntur

    Follow us on

    Guntur: చదువేస్తే ఉన్నమతి పోయింది అనే నానుడి ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. రాకెట్‌లో ఆకాశంవైపు దూసుకుపోతున్న నేటి రోజుల్లో కూడా కొంతమంది ఇప్పటికీ మూఢనమ్మకాలు, మంత్రాలు, తంత్రాలు అని నమ్మిస్తున్నారు. మోసపోయేవాడు ఉన్నంత వరకు నమ్మించేవాడు ఉంటాడన్నట్లు.. కొంతమంది సదువుకున్న సన్నాసులు ఈజీ మనీ కోసం స్వామీజీల అవతారం ఎత్తుతున్నారు. మహిళలను మోసం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది. క్షుద్రపూజల పేరుతో యువతులతో నగ్న పూజలు చేయించింది ఓ ముఠా. బాధితుల ఫిర్యాదుతో ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

    గుంటూరు జిల్లాలో ఘటన..
    గంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన పూజారి నాగేశ్వరరావు పూజలు చేస్తుంటాడు. చిలకలూరిపేటకు చెందిన అరవింద అనే మహిళ పలు వ్యాపారులు చేసి నష్టపోయింది. సామాజిక మాధ్యమం ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. గుప్త నిధుల కోసం సులభంగా డబ్బులు సంపాదించేందుకు క్షుద్ర పూజలు చేయాలని పథకం రచించారు. ఇందుకోసం యువతులు కావాలని.. నగ్నంగా పూజలో కూర్చుంటే రూ.లక్ష ఇస్తామని అరవింద, పూజారి నాగేశ్వరరావు.. నాగేంద్ర అనే వ్యక్తికి చెప్పారు. దీంతో నాగేంద్ర, అతని స్నేహితుడు సురేశ్‌ నంద్యాల జిల్లాలో పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు యువతులకు డబ్బు ఆశ చూపి ఒప్పించారు.

    యువతులపై లైంగికదాడి..
    అరవింద వారిని పూజారి నాగేశ్వరరావు వద్దకు తీసుకెళ్లింది. వారితో పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి, అతని అనుచరులు యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వారు ఎదురు తిరగడంతో శనివారం ఆ యువతులను బెదిరించి ఓ కారులోకి ఎక్కించి గుంటూరు వైపు బయలుదేరారు. గోరంట్ల సమీపంలో యువతులు తప్పించుకుని దిశ యాప్‌ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. నల్లపాడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పూజారి, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.

    12 మంది అరెస్ట్‌…
    యువతులతో క్షుద్ర పూజలు చేసిన ముఠాను నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో పూజారి నాగేశ్వరరావు, నాగేంద్రబాబు (పొన్నెకల్లు), అరవింద, రాధా (చిలకలూరిపేట), సురేష్‌ (గుంటూరు), భాస్కర్, పెద్దిరెడ్డి, సాగర్, శివ, సునీల్, పవన్, సుబ్బులు (నంద్యాల జిల్లా) ఉన్నారు.

    వాళ్లే ఎదవలు అంటే.. డబ్బులకు ఆశపడి యువతులు కూడా ట్రాప్‌లో పడడంతో ఘోరం జరిగిపోయింది. డబ్బే సర్వస్వం అనుకుని ముక్కు మొఖం తెలియనివారి మాటలు నమ్మితే ఏం జరుగుతుంది అనేదానికి ఇదో ఉదాహరణ.