
Ram Charan-NTR: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇటీవల ఆస్కార్ ను కొట్టుకొచ్చిన నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ టీం సంబరాలు చేసుకుంటోంది. ఆస్కార్ అవార్డు సందర్బంగా చెర్రీ, తారక్ లు కలిసి పలు అంతర్జాతీయ వేదికలపై కలిసి కనిపించారు. వివిధ కేటగిరీల్లో కలిసి అవార్డులను అందుకున్నారు. ‘నాటు నాటు ’ సాంగ్ కు ఆస్కార్ వచ్చిన సందర్భంగా స్టేజి ఎక్కారు. ఆ తరువాత ఇండియాకు వచ్చిన తరువాత ఈ ద్వయం మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు వీరిద్దరు మరోసారి ఒకే వేదికపైకి రానున్నారు. అదెక్కడో చూద్దాం.
అక్కినేని ఫ్యామిలీ మూడో తరం హీరో అఖిల్ చైల్డీష్ లోనే సినిమా ఎంట్రీ ఇచ్చారు. ‘సిసింద్రీ’తో తనకు యాక్టింగ్ తెలుసని బాలుడి వయసులోనే నిరూపించారు. పెరిగి పెద్దయ్యాక ‘మనం’ సినిమాలో ఎంట్రీ ఇచ్చినా ‘అఖిల్’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తరువాత మజ్ను తదితర సినిమాలు తీసినా హిట్టు కొట్టలేకపోయాయి. అయితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా యావరేజ్ హిట్టు కొట్టడంతో హిట్ ట్రాక్ లో పడ్డారు. ఈ సినిమా తరువాత కాస్త గ్యాబ్ తీసుకున్న అఖిల్ భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు.

సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న ‘ఏజెంట్’ అనే సినిమాలో అఖిల్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ బాగానే కష్టపడినట్లు తెలుస్తోంది. తన బాడీ బిల్డింగ్ షేప్ ను మొత్తం మార్చేసిన పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సిక్స్ ప్యాక్ బాడీ తో గన్స్ పట్టుకున్న ఫొటో మరింత ఆకట్టుకుంటోంది. ‘ఏజెంట్’ సినిమాతో అఖిల్ కెరీర్ మారిపోతుందని అక్కినేని ఫ్యాన్స్ పోస్టులు పెడుతూ హంగాగా చేస్తున్నారు. సోషల్ మీడియాలో అఖిల్ వస్తున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీగానే చేయాలని ప్లాన్ వేస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన ‘ఏజెంట్’ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో సినిమా ప్రమోషన్స్ కోసం స్టార్ హీరోలను తీసుకురావాలని నిర్మాతలు అనుకుంటున్నారు. అందుకు రామ్ చరణ్, ఎన్టీఆర్ లైతేనే బాగుంటుందని నిర్ణయించారట. ఇందులో భాగంగా చెర్రీ, తారక్ లో ఒకే వేదికపైకి వచ్చి ఏజెంట్ గురించి మాట్లాడుతారన్న చర్చ సాగుతోంది. అయితే ఈ వేదికపైకి వారు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. కానీ వస్తే మాత్రం సినిమా అంచనాలు విపరీతంగా పెరుగుతాయని అంటున్నారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్; సురేంద్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. సంగీతాన్ని కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిపాప్ తమీజా అందిస్తున్నారు. ఇక ఏజెంట్ ను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్లు సినిమా బృందం ప్రకటించింది.