
Bandi Sanjay: బండి సంజయ్.. హిందుత్వానికి తనూ ఓ బ్రాండ్. హిందువుల బంధువుగా ఆయనకు తెలంగాణలో ఒక గుర్తింపు ఉంది. ఇక ఆయనకు మాస్ లీడర్‌గా మరో ఇమేజ్ ఉంది. ఆ ఇమేజే నేడు బీజేపీని తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయంగా నిలబెట్టింది. ఆ అగ్రసివ్‌నెసే.. తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పదే పదే బీజేపీ గురించి మాట్లాడేస్థాయికి తెచ్చింది. ఇదంతా బండి సంజయ్‌కి ఒకవైపు.. ఇంకోవైపు బండి సంజయ్‌లో చిన్న పిల్లవాడి మనస్తత్వం ఉంది. అందరినీ కలుపుకుపోయే స్నేహతత్వం ఉంది. ఎవరడిగినా షేక్‌హ్యాండ్ ఇచ్చే మిత్రుడు ఉన్నాడు సంజయ్‌లో..
మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చి..
బండి సంజయ్ రాజకీయ ఎదుగుదల అంత సులభంగా సాగలేదు. బీర్‌ఎస్‌లో కేటీఆర్, కవిత ఎదిగినంత ఈజీగా లేదు బండి సంజయ్ పొలిటికల్ ప్రస్థానం. అనేక ఆటోపోట్లను ఎదురుకొంటూ అధిగమిస్తూ ముందుకు సాగారు.. సాగుతున్నారు. దశాబ్దం క్రితం ఆయన మృత్యువు అంచుల వరకు కూడా వెళ్లొచ్చారు. మండు వేసవిలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ర్యాలీలో బండి స్పృహతప్పారు. కుప్పకూలిపోయారు. కానీ ఆ హనుమాన్ ఆశీర్వాదంతో మృత్యువు అంచువరకు వెళ్లి మళ్లీ వచ్చారు.
మానవత్వ పరిమళాలు.. ఆత్మీయ అనుబంధాలు..
సంజయ్‌లో రాజకీయంగా అగ్రెసివ్‌నెస్ ఉన్నా.. ఆయనలో మానవత్వం చాలా ఎక్కువ. హిందూ బంధువులకు ఏ ఆపద వచ్చినా ముందు నిలిచేది బండి సంజయ్. పార్టీ, కులం చూడరు. ధనిక, పేద అని లోచించరు. హిందువు అయితే చాలు.. మతపరమైన వేధింపులకు, వివక్షకు గురవుతున్నాడని తెలిస్తే చాలు అక్కడ వాలిపోతారు. ఆ మానవత్వమే ఆయనను రాష్ట్రస్థాయి నాయకుడిని చేసింది. ఎంపీగా గెలిపించింది. ఇక అత్మీయత విషయంలో ఆయన తీరే వేరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న నానుడికి అచ్చంగా సరిపోతారు బండి. సాధారణంగా నాయకులు పదవికి ముందు ప్రజలకు షేక్‌హ్యాండ్ ఇస్తారు, చేతులు పట్టుకుంటారు. వంగి వంగి దండాలు పెడతారు. పదవి వచ్చిన తర్వాత కాలర్‌ఎగరేస్తారు. చుట్టూ తన మంది మార్బలం పెట్టుకుని హల్‌చెల్ చేస్తారు. సామాన్యుడిని దగ్గరకు కూడా రానివ్వరు. కానీ బండి సంజయ్ పదవికి ముందు ఒకలా, పదవి వచ్చిన తర్వాత ఒకలా ఉండరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న భావన ఆయనది. అందుకే తనక ఎదురైనది శత్రువైనా నవ్వుతూ పలకరిస్తారు. కరచాలనం చేస్తారు. ఆలింగనం చేసుకుంటారు. ఇక చిన్న పిల్లలు అయితే ఫొటో దిగుతారు, విద్యార్థులు, యువత అయితే సెల్ఫీ దిగుతారు. ఈ వీడియో చూసిన తర్వాత అందరినీ కలుపుకుపోవడంలో ప్రస్తుత రాజకీయాల్లో బండి సంజయ్ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. చెబుతారు కూడా.