
NTR – Koratala Movie Title: #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఎదో ఒక కారణాల చేత ఈ సినిమా ముహూర్తం వాయిదా పడుతూ వస్తుంది.ముహూర్తపు కార్యక్రమాలు జరుపుకోవడానికే ఇన్ని రోజుల సమయం తీసుకుంటే, ఇక రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవ్వడానికి ఇంకెన్ని రోజులు సమయం పడుతుందో అని అభిమానులు కంగారు పడుతున్నారు.
అయితే రీసెంట్ గానే ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతుంది అని అధికారిక ప్రకటన మూవీ టీం నుండి రావడం తో అభిమానులు కాస్త సంతోషపడ్డారు.ఈ సినిమా షూటింగ్ కూడా ఈ నెలలోనే ప్రారంభం అవ్వబోతుందని టాక్.ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి కొన్ని లీక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతూ అభిమానులను సంతోష పడాలో,ఏడవాలో తెలియని పరిస్థితి లో పడేసింది.
అదేమిటంటే ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్ ని పెట్టేందుకు పరిశీలిస్తున్నారని తెలుస్తుంది.ఈ టైటిల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది.ఈ టైటిల్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని పొగడడం కోసం ఎక్కువగా వాడుతూ ఉంటాడు.అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ విషయాన్నీ ఒక పెద్ద పండుగలాగా చేద్దాం అనుకున్నారు అభిమానులు.

కానీ సోషల్ మీడియా లో ముందుగా ఇలా లీక్స్ అవ్వడం వాళ్ళ థ్రిల్లింగ్ ఫాక్టర్ మిస్ అవుతుందని, దయచేసి దీనిపై తగిన శ్రద్ద తీసుకోవాలి అంటూ అభిమానులు మూవీ టీం ని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.