
Venkatesh- Rana: సుమారుగా పాతికేళ్ల తర్వాత మన టాలీవుడ్ లో మల్టీస్టార్ర్ర్ ట్రెండ్ కి తెరలేపిన హీరో విక్టరీ వెంకటేష్.’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి నటించి మల్టీస్టార్ర్ర్ మూవీస్ ట్రెండ్ లేపిన వెంకటేష్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, రామ్, వరుణ్ తేజ్ మరియు నాగ చైతన్య వంటి హీరోలతో కలిసి నటించి ఆయన ప్రారంభించిన ట్రెండ్ ని ఆయనే కొనసాగించాడు.
అయితే ఇంత మంది హీరోలతో కలిసి నటించిన వెంకటేష్ ఇప్పటి వరకు తన అబ్బాయి రానా దగ్గుపాటి తో కలిసి నటించలేదు.కృష్ణం వన్డే జగద్గురుమ్ సినిమాలో వెంకటేష్ చిన్న అతిథి పాత్ర ద్వారా కనిపిస్తాడు కానీ, పూర్తి స్థాయి సినిమా మాత్రం ఇప్పటి వరకు కలిసి చెయ్యలేదు.కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ వీళ్ళిద్దరిని పెట్టి ‘రానా నాయుడు’ అనే క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ని తీసింది.
షూటింగ్ కార్యక్రమాలను ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్, విడుదలకి మాత్రం చాలా సమయమే తీసుకొని మొత్తానికి రేపు విడుదల కాబోతుంది.ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి కూడా ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇక ట్రైలర్ లో వెంకటేష్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎప్పుడు మాట్లాడని బూతులు మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.ముఖ్యంగా రానా తో ‘చిన్నప్పటి నుండి నీ ము* కడిగిన వాడిని..నాకు తెలియదా నీ గు*లో ఎంత సత్తా ఉందో’ అని అంటాడు.

ఇదే విషయాన్నీ రీసెంట్ గా జరిగిన విలేకరుల సమావేశం లో వెంకటేష్ ని ఒక పాత్రికేయుడు అడుగుతాడు, ‘మీరు నిజంగానే చిన్నప్పుడు రానా ము* కడిగారా’ అని, అప్పుడు వెంకటేష్ చాలా చిరాకు గా ఆ ప్రశ్నకి సమాధానం దాటవేస్తాడు..మరో విలేకరి మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుండి మీ ఇద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంటుంది,కానీ ట్రైలర్ చూస్తూ ఉంటే ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు’ అని అడగగా ‘ఇది షో అమ్మా’ అని వెంకటేష్ సింపుల్ గా సమాధానం చెప్తాడు.