Th End of Earth : ఒకటి కాదు.. రెండు కాదు 56 కిలోమీటర్ల మేర భూమి చీలిపోతే దానిని ఏమనాలి? ఏమని వర్ణించాలి? ప్రళయమని కొందరు చెబుతుండగా.. భూమి అంతానికి సంకేతమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాదు కాదు భూమి పై మరో ఖండం ఉద్భవిస్తుందని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానిపై అధ్యయనం ప్రారంభించారు. సాధారణంగా భూకంపం సమయంలో భూమి చీలిపోవడం చూస్తుంటాం. కానీ ఆఫ్రీకాలో అకారణంగానే భూమి భారీగా చీలిపోయింది. అచ్చం ప్రళయం మాదిరిగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే అది ఏమని తెలియక ప్రజలు శాస్త్రవేత్తల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కొన్ని లక్షల సంవత్సరాల కిందట భూగర్భంలో చోటుచేసుకున్న పరిణామాలతో భూమి ఏడు ఖండాలుగా విడిపోయింది. ఆసియా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, యూరఫ్ లను ఖండాలుగా విభజించారు. భారత్ వంటి ఉప ఖండాలు సైతం ఉన్నాయి. మూడు నెలల కిందట ఆఫ్రికాలో 56 కిలోమీటర్ల మేర భూమిలో చీలికలు ఏర్పడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇంతటి భారీ స్థాయిలో చీలికలతో భారీ ప్రళయం రాబోతుందని అనుమానిస్తున్నారు. స్థానికంగా ఉండేందుకు ఇష్టపడడం లేదు. చీలిక వచ్చిన ప్రాంతాల నుంచి ఎక్కువ మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
ఈ చీలికలు ఇలా విస్తరించుకుంటూ పోతే ఆఫ్రికా రెండు ఖండాలుగా విడిపోవడం ఖాయమని కథనాలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రపంచ పటంలో మరో కొత్త ఖండం ఆవిర్భవించనుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా టెక్టోనిక్ ప్లేట్ ను పరిశీలిస్తున్నారు. భూమి అంతర్భాగంలో ఉండే టెక్టోనిక్ ప్లేట్ గా రెండుగా విభజించినప్పుడు ఇటువంటి పగుళ్లు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చీలికలు క్రమేపీ విస్తరిస్తుండడం మాత్రం కలవరపాటుకు గురిచేసే అంశం. అయితే ఈ చీలికలు ఆఫ్రికాకే పరిమితమవుతాయా? మిగతా చోట్లకు విస్తరించే అవకాశం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.