https://oktelugu.com/

Virat Kohli Restaurant: కోహ్లీ రెస్టారెంట్లో మొక్కజొన్న ఖరీదు అంతా? బాబోయ్ మూడు బిర్యానీలు అవలీలగా కొనొచ్చు ..

డబ్బున్నోళ్లు తాగే నీళ్ల నుంచి మొదలు పెడితే తినే తిండి వరకు ఉదారంగా ఖర్చు చేస్తుంటారు.. దానికోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. కానీ వారిని చూసి మనం కూడా అలానే చేస్తే జేబుకు చిల్లు పడటం ఖాయం. అలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురయింది..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 14, 2025 / 08:13 PM IST

    Virat Kohli Restaurant

    Follow us on

    Virat Kohli Restaurant:  మనదేశంలో ప్రసిద్ధ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒకడు. సులువుగా పరుగులు చేసి.. జట్టుకు విజయాలు అందించడంలో ఇతడు దిట్ట. అందువల్ల ఇతడిని టీమిండియా (team India) పరుగుల యంత్రం (run machine) అని పిలుస్తుంటారు.. ప్రస్తుతం ఇతడి కెరియర్ చివరి దశకు చేరుకుంది. మహా అయితే రెండు లేదా మూడు సంవత్సరాల నుంచి ఇతడు క్రికెట్ ఆడే అవకాశం లేదని స్పోర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు.. విరాట్ కోహ్లీ కూడా తన కెరియర్ మెరుగ్గా ఉన్న దశలోనే one 8 commune పేరుతో రెస్టారెంట్లను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఇవి ఢిల్లీ,  ముంబై, ఇతర ప్రాంతాలలో సేవలు అందిస్తున్నాయి. విరాట్ కోహ్లీ మీద విపరీతమైన అభిమానం ఉన్నవాళ్లంతా ఈ రెస్టారెంట్లకు వెళ్తున్నారు. అక్కడ దొరికే రుచులను ఆస్వాదిస్తున్నారు. ఈ రెస్టారెంట్లో ఇండియన్, వెస్ట్రన్ రుచులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని గతంలో చాలామంది తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా కోహ్లీ రెస్టారెంట్ చైన్ one 8 commune గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.. ఈ రెస్టారెంట్లో ధరలు భారీగా ఉన్నాయని ఓ నెటిజెన్ చెప్పడం సంచలనంగా మారి.
    525 చెల్లించింది 

    కోహ్లీకి హైదరాబాదు నగరంలోనూ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ కూడా భారీ స్థాయిలో ధరలు ఉన్నాయని గతంలో చర్చ జరిగింది. ఈ రెస్టారెంట్లో ఉడకబెట్టిన ప్లేట్ కంకులకు 525 చెల్లించినట్టు యువతి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇది ఒక్కసారిగా సంచలనం గా మారింది. ఈ క్రమంలో కొంతమంది ఆమెకు మద్దతు ఇస్తుంటే.. మరికొందరు ఆమె తీరును తప్పు పడుతున్నారు.. లగ్జరీ హోటల్స్ లో అంబియన్స్ కు ఆ మాత్రం ధర ఉంటుందని.. అది తెలియకుండా అక్కడికి ఎందుకు వెళ్లారని కొంతమంది అంటుంటే.. ఇంకొందరేమో one 8 commune మొత్తానికీ మీరు చెల్లించారేమో అని కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ యువతి పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. కేవలం ఉడకబెట్టిన ప్లేటు మొక్కజొన్న కంకులకు 525 రూపాయలు తీసుకుంటుంటే.. ఇక బిర్యానీలు, ఇతర వాటికి ఎంత తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని.. ధరలు చూస్తుంటేనే బాబోయ్ అనిపిస్తోందని.. విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కు వెళ్లాలంటే వ్యాలెట్ నిండా డబ్బులు తీసుకెళ్లాలని నెటిజన్లు ఆ యువతిని ఉద్దేశించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.