https://oktelugu.com/

Sankranthi Movies : అనిల్ రావిపూడి వర్సెస్ బాబీ కొల్లి ఇద్దరిలో ఈ సంక్రాంతి కి భారీ కలెక్షన్స్ ను సాధించే దర్శకుడు ఎవరు..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో కమర్షియల్ డైరెక్టర్లకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న దర్శకులు భారీ విజయాలను సాధించాల్సిన అవసరం అయితే ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : January 14, 2025 / 08:18 PM IST
    Follow us on

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేస్తూ డైరెక్టర్లుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో అనిల్ రావిపూడి ఒకరు. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను సాధిస్తూ స్టార్ డైరెక్టర్ గా ముందుకు సాగుతున్నాడు. ఇక ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఒక వర్గం ప్రేక్షకులు ఆయన సినిమాలను చూడడానికి చాలా వరకు ఆసక్తి అయితే చూపిస్తున్నారు. నిజానికి ఆయన చేసే ప్రతి సినిమా కూడా ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని అలరించడమే కాకుండా ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతుంది. ఇక ఇదిలా ఉంటే బాబీ లాంటి డైరెక్టర్ కూడా కమర్షియల్ డైరెక్టర్ గానే కెరియర్ ను మొదలుపెట్టాడు. దాదాపు వీళ్ళిద్దరూ కూడా ఒకే సమయంలో కెరియర్ ని స్టార్ట్ చేయడం విశేషం…మరి బాబి లాంటి దర్శకుడు హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఈయన డైరెక్షన్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లడం విశేషం… ఇక ప్రస్తుతం ఈయన ‘డాకు మహారాజు’ సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

    మరి ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

    అయితే కమర్షియల్ ఫార్మాట్ లోనే సినిమాలు చేస్తూ రొటీన్ స్టోరీ కి కూడా వాళ్ల తరహాలో ట్రీట్ మెంట్ ని అందిస్తూ ఒక సక్సెస్ ఫుల్ సినిమాను చేయడానికి వీళ్ళు అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఈ సంక్రాంతికి భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించారు. తద్వారా ఎవరి కలెక్షన్స్ ఎంత రాబోతున్నాయనేది తెలియాల్సి ఉంది. ఇక రెండు సినిమాలు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న నేపధ్యం లో లాంగ్ రన్ లో ఈ రెండు సినిమాలకు ఎలాంటి ఎలక్షన్స్ రాబోతున్నాయి.

    తద్వారా వీళ్ళు ఎలాంటి దర్శకులుగా మారబోతున్నారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాని చిరంజీవితో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక బాబీ తన తర్వాత సినిమా ఎవరితో చేయబోతున్నాడనే విషయం మీద ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు…