
Jagan- Modi: హుటాహుటిన గురువారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన ముఖ్యంత్రి జగన్ శుక్రవారం ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఉదయం అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ బడ్జెట్ ప్రవేశపెట్టగా, సాయంత్రం ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆయన వెళ్లారని పార్టీ శ్రేణులు అంటున్నా, అసెంబ్లీ సమావేశాలను కూడా వదిలి వెళ్లేంత అర్జంటు పని ఏముంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
సీబీఐ, ఈడీల నుంచి తప్పించుకునేందుకేనా?
బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వివేకా స్థానంలో ఎంపీగా పోటీ చేసిన అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. తనను అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేసి ఉన్నారు. తాజగా ఆ పిటీషన్ ను కోర్టు కొట్టేసింది. అరెస్ట్ చేయొద్దని తాము చెప్పలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇది జరిగిన కొద్ది సేపటికే జగన్‌తో అవినాష్ రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తుంది. సీబీఐ జగన్ ను సమీపించే రోజులు ఎంతో దూరంలో లేవని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారై కవితను ఇప్పటికే పలుమార్లు పిలిచి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. గురువారం ఏపీ ఎంపీ మాగుంటకు నోటీసులందాయి. ఇప్పటికే ఆయన కుమారుడు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కుంభకోణంలో మరింత మంది ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

స్వప్రయోజనాలకే ప్రాధాన్యమా?
ఈ పరిస్థితుల నేపథ్యంలోనే జగన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడినట్లుగా తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మీద ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు బీజేపీతో దగ్గరి సంబంధాలు నెరుపుతున్నారు. ఆయన ఏ కష్టం వచ్చినా ముందు ఢిల్లీకి వెళతారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, వ్యక్తిగత వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికే ఆయన వెళ్తుంటారని ప్రతిపక్షాల ఆరోపణల్లోను నిజం లేకపోలేదు. రాబోవు ఎన్నికల్లో బీజేపీతో జగన్ కలిసివెళతారనే పుకార్లు వినిపిస్తున్నాయి. సాక్షి మీడియాలో మాత్రం రాష్ట్రం కోసం ఆయనెంతో పరితపిస్తున్నట్లుగా రాతలు, కథనాలు ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలను కూడా వదిలి హఠాత్తుగా జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లిందో మాత్రం చెప్పకపోవడం కొసమెరుపు.