
Chiranjeevi- Ram Charan: అంతేకాదు పుత్రోత్సాం పుత్రుడు పుట్టినప్పుడే పుట్టదు.తన కొడుకు ఎదిగి ఒక మంచి ప్రయోజకుడు అయ్యాక తనని అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఆ తండ్రికి కలిగే ఆనందం. ఈ నానుడి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు అచ్చంగా సరిపోతుంది. తండ్రి ముందే కొడుకు ఎదుగుతుంటే ఏ తండ్రికి సంతోషంగా ఉండదు చెప్పండి. ఇప్పుడు అలాంటి అనుభూతే చెందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన కొడుకు రామ్‌చరణ్ దేశం దాటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో చిరంజీవి ఆనందానికి అవధులు లేవు.
ఇంటర్వ్యూల్లో తండ్రి గురించే..
ఇక చెర్రీ హాలీవుడ్ మీడియాకు ఇచ్చే అన్ని ఇంటర్వ్యూలను చూస్తూ చిరంజీవి తెగ మురిసిపోతున్నారు. అంతేకాదు చెర్రీ ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా అందులో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గురించి తప్పక ప్రస్తావిస్తున్నాడు. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన నటనే తాను చేస్తున్న పాత్రలు అని చెబుతున్నాడు. అంతేకాదు. తన తండ్రి టాలీవుడ్ స్టార్ అని, ఆయన కడుపున పుట్టడం తన అదృష్టమని చెబుతున్నాడు. ఇంటర్వ్యూలలో తన గురించి చెబుతూ ఉంటే అవి చూసి ఆనంద పడుతున్నాడు చిరంజీవి.

గ్రాండ్‌గా వెల్‌కం పార్టీ..
ఆస్కార్ అవార్డ్స్‌లో భాగమైనందుకు రామ్‌చరణ్ ఇండియాకి రాగానే ఒక మంచి వెల్‌కం పార్టీ ఇవ్వాలని చూస్తున్నారట చిరంజీవి. అంతేకాదు ఆ వెల్‌కం పార్టీకి ఆర్‌ఆర్‌ఆర్ మూవీ యూనిట్‌తో పాటు ఎన్టీఆర్ అలాగే సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలను ఆహ్వానించాలని భావిస్తున్నారట. అంతేకాదు ఆ పార్టీలో తన కొడుకు రామ్‌చరణ్‌కి ఇష్టమైన ఫుడ్ డిష్‌లను రెడీ చేయిస్తాడని తెలుస్తోంది.
సర్‌ప్రైజ్ గిఫ్ట్ కూడా..
గ్రాండ్ వెల్‌కం పార్టీతోపాటు చెర్రీకి ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్ కూడా మెగాస్టార్ చిరంజీవి రెడీ చేస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు గిఫ్ట్‌ను ఇప్పటికే కొనుగోలు చేశాడని సమాచారం. మరి చిరంజీవి కొన్న ఆ సర్ర్‌పైజ్ గిఫ్ట్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.