Tarakaratna- Balakrishna: గత కొంతకాలం గా సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతున్న పేరు నందమూరి తారకరత్న..నారా లోకేష్ ‘యువగళం’ పేరిట తలపెట్టిన పాదయాత్ర ప్రారంభం లో పాల్గొన్న తారకరత్నకి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోవడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లో మునిగిపోయింది..ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ లో చికిత్స పొందుతున్న తారకరత్న ఇప్పటికీ కోలుకోలేదు.

టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు మరియు రాజకీయ నాయకులందరూ బెంగళూరు కి వచ్చి తారకరత్న ని రోజూ చూస్తూనే ఉన్నారు..చిరంజీవి వంటి వారు కూడా తారకరత్న ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడ్డాడని చెప్పడం తో నందమూరి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు..అయితే తారకరత్న గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా లో ఎదో ఒక కథనం ప్రచారం అవుతూనే ఉంది..రీసెంట్ గా ఆయన చివరి కోరిక గురించి ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది.
అదేమిటంటే తారకరత్న కి బాలయ్య అంటే ఎంతో ఇష్టం..తన సొంత తండ్రి కంటే కూడా ఆయన బాలయ్య బాబునే ఎక్కువ ఇష్టపడతాడు..బాలయ్య బాబు కూడా తారకరత్న ని సొంత కొడుకులాగానే ట్రీట్ చేస్తాడు..తారకరత్న కి ఇలా జరిగిందనే విషయం తెలుసుకున్న వెంటనే బాలయ్య బాబు తన మకాం బెంగళూరులోనే వేసాడు..తనకి ఉన్న ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలను పక్కన పెట్టేసి నిద్రాహారాలు కూడా లేకుండా తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ, అతనికి కావాల్సిన అవసరాలను దగ్గరుండి చూసుకుంటున్నాడు.

ఇదంతా చూస్తే బాలయ్య కి తారకరత్న అంటే ఎంత ప్రేమ ఉందొ అర్థం అవుతుంది..అయితే తారకరత్న కి చివరి కోరిక ఏమిటంటే నందమూరి బాలకృష్ణ తో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలి అని..ఇన్నేళ్లు ఇండస్ట్రీ లో ఉన్నా బాలయ్య తో కలిసి ఒక్క సినిమా కూడా చెయ్యలేకపోయానే అని బాధ తారకరత్న లో ఉండేదట..ఈ విషయాన్నీ ఆయనే పలు ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చాడు..మరి తారకరత్న పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత అతనితో కలిసి బాలయ్య ఒక సినిమా చేస్తాడో లేదో చూడాలి.