Waltair Veerayya Collection 20 Days: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే..చాలా టఫ్ కాంపిటీషన్ మధ్య విడుదలైన ఈ సినిమా వన్ సైడ్ వార్ లాగ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్లి సంక్రాంతి విజేతగా నిలిచింది..మెగాస్టార్ కి వరుసగా రెండు డిజాస్టర్స్ తర్వాత వచ్చిన భారీ సక్సెస్ అవ్వడం తో మెగా అభిమానుల ఆనందం మాటల్లో చెప్పలేము..అయితే ఇప్పటికే ఈ సినిమా వచ్చి 20 రోజులు పూర్తి చేసుకోవడం కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి..చాలా ప్రాంతాలలో క్లోసింగ్ లో దగ్గరగా వచ్చేసింది..కొన్ని ప్రాంతాలలో #RRR మరికొన్ని ప్రాంతాలలో నాన్ రాజమౌళి రికార్డ్స్ పెట్టిన ఈ సినిమా ప్రాంతాలవారీగా 20 రోజులకు గాను ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూద్దాము.

ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజాం 36.00 కోట్లు
సీడెడ్ 18.00 కోట్లు
ఉత్తరాంధ్ర 19.80 కోట్లు
ఈస్ట్ 12.83 కోట్లు
వెస్ట్ 7.50 కోట్లు
నెల్లూరు 4.50 కోట్లు
గుంటూరు 9.03 కోట్లు
కృష్ణ 7.56 కోట్లు
మొత్తం 109.62 కోట్లు
ఓవర్సీస్ 13.11 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.08 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 135.15 కోట్లు

వాల్తేరు వీరయ్య సినిమాకి ముందు రాజమౌళి సినిమాలు కాకుండా టాప్ 3 స్థానాల్లో అలవైకుంఠపురం లో ,సైరా నరసింహా రెడ్డి , సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు ఉండేవి..ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని దాటి నాన్ రాజమౌళి టాప్ 3 హైయెస్ట్ షేర్స్ సాధించిన చిత్రాలలో ఒకటి గా నిలిచింది..ఇంకా కాస్త మెరుగైన టాక్ వచ్చి ఉంటే అలా వైకుంఠపురం లో రికార్డ్స్ ని బద్దలు కొట్టేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..కానీ ఒక మామూలు యావరేజి సినిమాని ఈ రేంజ్ లో వసూలు చెయ్యడం అంటే సాధారణమైన విషయం కాదు..మెగాస్టార్ చిరంజీవి వల్లే అది సాధ్యం అని విశ్లేషకులు చెప్తున్నారు.