Viral Video: ధీరుబాయ్ అంబానీ పెట్రోల్ బంక్ లో పనిచేశారు. కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఆయన కొడుకులు అనిల్, ముఖేష్ ధీరుబాయ్ అంబానీ వ్యాపార సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరించారు. అనిల్ అంబానీ కాస్త వెనుకబడినప్పటికీ.. ముఖేష్ అంబానీ వ్యాపారాన్ని అన్ని రంగాల్లోకి పెంచుకుంటూ పోయారు. ధీరుబాయి అంబానీ పెద్దపెద్ద ఐఐటీలలో చదువుకోలేదు. పేరుపొందిన ఐఐఎం లో విద్యను అభ్యసించలేదు.. కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నారు. ఈ స్థాయికి ఎదిగారు.
ఇంక నేటి సోషల్ మీడియా కాలంలో ఒకసారి ఫేం వస్తే చాలు వారి వ్యాపారం అంతకంతకు పెరిగిపోతుంది. ఉదాహరణకు డాలి (Dolly chaiwala) అనే చాయ్ వాలా సోషల్ మీడియా వల్ల ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. అతడు చాయ్ చేసే విధానం విభిన్నంగా ఉంటుంది. దానిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అది విపరీతమైన ఆదరణ పొందింది. ఫలితంగా డాలీ చాయ్ వాలా(dolly chaiwala) ఒకసారిగా సెలబ్రిటీ అయిపోయాడు. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అతడు ప్రతిరోజు ఐదు లక్షల వరకు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani) వివాహం సందర్భంగా ఇండియాకు మైక్రోసాఫ్ట్ (Microsoft) అధినేత బిల్ గేట్స్ (Bill gates) వచ్చారు. ఈ సందర్భంగా డాలి చాయ్ వాలా ను కలిశారు. అతడు చేసిన చాయ్ ని తాగారు. చాయ్ టేస్ట్ అతడిని ఆకట్టుకుంది.
వడ పావ్ తో రోజుకు 40 వేలు
ఇక ఢిల్లీ మహా నగరానికి చెందిన ఓ యువతి వడ పావ్ విక్రయిస్తూ ప్రతిరోజు 40 వేల వరకు సంపాదిస్తోంది. సంవత్సరానికి 1.4 కోట్లను ఆర్జిస్తోంది. ఢిల్లీకి చెందిన యువతి, డాలి చాయ్ వాలా సోషల్ మీడియా ను మాత్రమే నమ్ముకున్నారు. తమ బ్రాండ్ ను విస్తరించుకున్నారు. అంతకంతకు ఎదిగిపోయారు. ఇప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారి విజయం.. వారి స్ఫూర్తిదాయకమైన వ్యాపారం చాలామందికి ఆదర్శం. ఈ మాట అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన దేశానికి ఒక చాయ్ అమ్మిన వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు. ఇదే దేశంలో ఒక చాయ్ అమ్ముతున్న వ్యక్తి సెలబ్రిటీ అయిపోయాడు. వడ పావ్ విక్రయిస్తున్న యువతి కోట్లు సంపాదిస్తోంది. అయితే ఇదే సమయంలో ఐఐటీలో చదువుతున్న వారికి సరైన ఉద్యోగాలు లభించడం లేదు. వారు ఎదగడానికి అవకాశాలు లభించడం లేదు. అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులు.. మార్కెట్లో ఒడిదుడుకులు వారికి మెరుగైన ఉద్యోగాలు లభించకుండా చేస్తున్నాయి. అందువల్లే వారు అత్యల్ప ప్యాకేజీ (సంవత్సరానికి నాలుగు లక్షలకు) కి పనిచేయాల్సి వస్తోంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి IIT Bombay ప్లేస్మెంట్ నివేదిక లో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.. ఐఐటి బాంబేలో ప్లేస్మెంట్స్ కోసం 1979 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఇందులో 25% మందికి ఉద్యోగాలు రాలేదు. ప్లేస్మెంట్ రేటు గత ఏడాది 82% ఉండగా.. ఇప్పుడు అది 75 శాతానికి పడిపోయింది.. నిద్రాహారాలు మానివేసి చదువుతున్నప్పటికీ.. ఐఐటీలో చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వడంలో కంపెనీలు ఒకప్పటిలాగా ఆసక్తి చూపించడం లేదు. అయితే ఇలా చాలామంది విద్యార్థులకు ప్లేస్మెంట్లు రాకపోవడం వల్ల రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నప్పటికీ.. అంతిమంగా వీధులలో చాయ్, వడ పావ్ అమ్మే వారు కోటీశ్వరులుగా మారుతున్నారు. ఇదే సమయంలో ఈ వ్యాపారంలోకి ఐఐటీలు, ఐఐఎంలలో చదివేవారు వస్తున్నారు. పకోడీ, చాయ్, వడ పావ్, పానీపూరి, గోలి సోడా, సమోసా వంటి వ్యాపారాల్లోకి వస్తున్నారు.