
Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలలో అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న చిత్రం #OG.. కుర్ర డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 వ తారీఖు నుండి ముంబై లో ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ నిన్నటి నుండి పాల్గొంటున్నాడు, ఈ నెలాఖరు వరకు సాగనున్న ఈ సినిమా షూటింగ్ గురించి మూవీ టీం రోజుకి ఒక సెన్సేషనల్ అప్డేట్ ఇస్తూ అభిమానులను ఉర్రూతలూ ఊగిస్తుంది.
నేడు ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నట్టు మూవీ టీం అధికారిక ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ హీరోయిన్ ని అయితే కోరుకున్నారో ఆ హీరోయిన్ నే తీసుకున్నందుకు ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇలా ఎన్నో సర్ప్రైజ్ వార్తలు రాబొయ్యే రోజుల్లో రాబోతున్నాయని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో సుజిత్ ఫ్యాన్స్ కి అదిరిపొయ్యే ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని టాక్. #OG చిత్రానికి మరియు ప్రభాస్ నటించిన సాహూ చిత్రానికి లింక్ చేస్తూ ఒక యూనివర్స్ ని క్రియేట్ చేయబోతున్నాడట. ఈ సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో ఒక టాక్ జోరుగా ప్రచారం సాగుతుంది.

ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ ఇది నిజం అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూత్ మొత్తం విడుదల రోజు థియేటర్స్ ముందే ఉంటుంది. వీళ్లిద్దరి మాస్ ని తట్టుకోవడానికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ సరిపోతాయో లేదో కూడా అనుమానమే. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్లిద్దరి సొంతం.చూడాలి మరి ఈ వార్త నిజం అవుతుందో లేదో అనేది.