Adireddy Remuneration: బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీ ఫేమ్ తో వచ్చిన కంటెస్టెంట్స్ చివరి వారం వరుకు కొనసాగడమే కష్టం అనుకుంటున్న ఈరోజుల్లో ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్స్ లో నిలవడం అనేది మామూలు విషయం కాదు..అసాధ్యం అనుకున్న ఈ రేర్ ఫీట్ ని ఆదిరెడ్డి సాధించి చూపించాడు..హౌస్ లోకి అడుగుపెట్టకముందు ఆది రెడ్డి అంటే ఎవరికీ తెలియదు..బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తుంటాడని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

అలా సోషల్ మీడియా లో ఒక పరిమితి కి తగ్గ ఫేమ్ ని దక్కించుకున్న ఆదిరెడ్డి తన ఆటతీరు మరియు మాటతీరు తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు..టైటిల్ కూడా గెలిచి ఉంటే బాగుండేది కానీ..ఇంత దూరం రావడం కూడా గొప్పే..ఈ షో ఆయనని కెరీర్ పరంగా మరో లెవెల్ కి తీసుకెళ్తుందని ఆశించొచ్చు..సినిమాల్లో కూడా ఆయనకి అవకాశాలు రావొచ్చు.
అయితే ఆది రెడ్డి కి 15 వారాలు కొనసాగినందుకు గాను ఆయనకి వచ్చిన రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు..నాన్ సెలబ్రిటీ క్యాటగిరి నుండి వచ్చాడు కాబట్టి ఆయనకి కేవలం 5 లక్షల రూపాయిలు మాత్రమే ఇచ్చారట..ఎంత నాన్ సెలబ్రిటీ అయినా ఆది రెడ్డి బిగ్ బాస్ కి కావాల్సినంత కంటెంట్ ఇచ్చాడు..అటు ఎంటర్టైన్మెంట్ పరంగా, ఇటు టాస్కులు ఆడే విధానం పరంగా ఆయన తన బెస్ట్ ఇవ్వడానికి నూటికి నూరు శాతం కృషి చేసాడు.

ఓటింగ్ కూడా ఆయనకి టాప్ 3 రేంజ్ లో వచ్చాయి..కానీ చివరికి టాప్ 4 స్పాట్ కి పరిమితం చేసాడు బిగ్ బాస్..టాప్ 3 లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఆది రెడ్డి కి దాక్కుంటే బిగ్ బాస్ ఇచ్చిన 30 లక్షల ఆఫర్ ని తీసుకొని బయటకి వచ్చేవాడు..ఆది రెడ్డి లాంటి మిడిల్ క్లాస్ మనుషులకు 30 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు..కానీ బ్యాడ్ లక్ పాపం..ఏమి చెయ్యలేము!