Drinking Water During Meals: మనలో చాలా మందికి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం అలవాటు. ఒక్కొక్కరైతే బుక్క బుక్కకో గుటిక తాగుతారు. ఇది మంచిది కాదు. మనం భోజనం చేసేందుకు ఓ అరగంట ముందు నీళ్లు తాగాలి. భోజనం తరువాత కనీసం గంటన్నర విరామం ఇచ్చి నీళ్లు తాగుతుండాలి. అంతేకాని తినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ మనవారు వాటిని పట్టించుకోవడం లేదు. భోజనం చేసే సమయంలోనే పక్కన గ్లాస్ పెట్టుకుని మరీ తాగుతుంటారు. ఇది సమంజసం కాదు. భోజనం మధ్యలో మంచినీళ్లు తాగడం మంచిపద్ధతి కాదని తెలిసినా నిర్లక్ష్యమే. ఏమవుతుందిలే అనే ధోరణితో నీళ్లు తాగుతుంటారు.

భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడంపై ఎవరికి అవగాహన ఉండటం లేదు. ఫలితంగా తింటూనే నీళ్లు తాగుతూ ముగిస్తారు. సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి హైడ్రో క్లోరిక్ యాసిడ్ విడుదల అవుతుంది. ఇది మనం తిన్న పదార్థాలను జీర్ణం చేస్తుంది. మనం తినే ఆహారాలను జీర్ణం చేయడానికి యాసిడ్ కు నీరు అవసరం ఉండదు. మనం తాగే నీళ్లు యాసిడ్ తో కలవడం వల్ల మన జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది. దీంతో మనం తిన్నఆహారం తొందరగా జీర్ణం కాదు. ఆహారంతో పాటు నీరు తోడవడంతో యాసిడ్ గాఢత 0.5 కంటే తగ్గుతుంది.
యాసిడ్ గాఢత తగ్గడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా అవుతుంది. పలుచబడ్డ యాసిడ్ ను బ్యాలెన్స్ చేయడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. యాసిడ్ గాఢత తగ్గడంతో పొట్టలో అల్సర్లు ఏర్పడతాయి. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోతే కడుపులో గ్యాస్, తేన్పులు వస్తాయి. ఈ ఇబ్బందులున్నందునే మనం ఆహారం తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. లేకపోతే అలా కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకే ఆహారం తీసుకునే సమయంలో నీళ్లు తాగితే ఇబ్బందులు ఏర్పడతాయి.

హైడ్రో క్లోరిక్ యాసిడ్ తీవ్రత 0.8 నుంచి 1.2 వరకు ఉంటుంది. లోపలకు వెళ్లన ఆహారం జీర్ణం కావడానికి యాసిడ్ తోడ్పడుతుంది. యాసిడ్ పీహెచ్ విలువ 1.2 నుంచి 1.5 వరకు ఉంటేనే మన ఆహారం తొందరగా అరుగుతుంది. లేదంటే అలాగే ఉండిపోతుంది. అందుకే మనం భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం వల్ల ఇబ్బందులు వస్తాయి. మనం ఇప్పటికైనా గుర్తుంచుకుని తినే సమయంలో నీళ్లు తాగకుండా జాగ్రత్తలు తీసుకుని తిన్న తరువాత ఓ గంటన్నర తరువాత నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే మనకు జీర్ణ సమస్యలు రావు.