Anasuya Bharadwaj: ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ తన ట్రేడ్ మార్క్ వదలడం లేదు. దేవుడిచ్చిన అందాలు దాచుకోవడం కుదరదు అంటుంది. పబ్లిక్ లో కూడా అసలు తగ్గేదే లేదంటుంది. ఒక పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్న అనసూయ నడుము మడతలతో కుర్రాళ్ళను రెచ్చగొట్టింది. తాజాగా అనసూయ ప్రొద్దుటూరు వెళ్లారు. అక్కడ ఒక షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి అనసూయను హైర్ చేసుకున్నారు. గ్లామర్ ఉన్న తారలు తమ షాప్ ఓపెన్ చేస్తే మంచి పబ్లిసిటీ దొరుకుతుందని వ్యాపారులు భావిస్తారు. ముఖ్యంగా చీరలు, నగల దుకాణాలకు హీరోయిన్స్, టీవీ సెలెబ్రిటీలను పిలిచి రిబ్బన్ కటింగ్ చేయిస్తారు.
షాప్ ఓపెనింగ్ వంటి ఈవెంట్స్ హీరోయిన్స్ కి మంచి ఆదాయ మార్గం. రెండు మూడు గంటల్లో ముగిసే కార్యక్రమానికి లక్షల్లో వసూలు చేయవచ్చు. ఈ క్రమంలో ఒక షాప్ ఓపెనింగ్ లో భాగంగా అనసూయ ప్రొద్దుటూరు. పబ్లిక్ ఈవెంట్స్ లో హీరోయిన్స్ సాధారణంగా సాంప్రదాయంగా కనిపిస్తారు. కానీ అనసూయ తన మార్క్ చూపించారు. నడుము కనిపించేలా గ్లామర్ షో చేసింది. అనసూయను చూసేందుకు ప్రొద్దుటూరు కుర్రాళ్ళు ఎగబడ్డారు.
ముఖ్యంగా అనసూయ గ్లామర్ వాళ్ళకు పిచ్చెక్కించింది. వేల సంఖ్యలో అనసూయ కోసం బారులు తీరారు. ఇక తనకున్న క్రేజ్ చూసిన అనసూయ స్టన్ అయ్యారు. అలా ప్రొద్దుటూరు అబ్బాయిలకు అనసూయ నిద్ర లేకుండా చేశారు. కాగా అనసూయ జబర్దస్త్ మానేశారు. అనసూయ స్థానంలో కన్నడ నటి సౌమ్యరావు వచ్చారు. అనసూయ అంత కాకపోయినా సౌమ్య రావు జబర్దస్త్ యాంకర్ గా పర్లేదు అనిపిస్తుంది. జబర్దస్త్ తో పాటు పూర్తిగా బుల్లితెర షోస్ కి అనసూయ దూరం అయ్యారు.
నటిగా బిజీ అయిన ఆమె యాంకరింగ్ కి టాటా, బై బై చెప్పేసింది. అనసూయ ఒక్కొక్క కాల్షీట్ కి రెండు నుండి మూడు లక్షలు తీసుకుంటున్నారట. పెద్ద మొత్తంలో సినిమాల ద్వారా వస్తుంటే తనకు కెరీర్ ఇచ్చిన యాంకరింగ్ ని అనసూయ లైట్ తీసుకుంది. అనసూయ ఇప్పుడు అనుభవిస్తున్న ఈ ఫేమ్, స్టేటస్, లగ్జరీ లైఫ్ జబర్దస్త్ పుణ్యమే. ఆ షో లేకుంటే అనసూయ ఎవరో. ప్రారంభంలో నటిగా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ బ్రేక్ రాకపోవడంతో కార్పొరేట్ ఉద్యోగాలు చేశారు. తర్వాత న్యూస్ ప్రజెంట్ గా పని చేశారు. 2013లో జబర్దస్త్ మొదలు కాగా, యాంకర్ గా సెలెక్ట్ అయ్యారు.