Astrology: శకునం చెప్పే బల్లి కుడిదిలో పడిందట. మనకు శుభాశుభాలు చెప్పే బల్లి ఏ దిక్కులో పలికినా మనకు అనుకూల, ప్రతికూల ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఇంట్లో బల్లులను భయపడుతుంటారు. హిందూ శాస్త్రం ప్రకారం బల్లికి విశిష్టమైన స్థానం ఉంది. బల్లి మీద పడితే మంచిది కాదని అంటుంటారు. బల్లి మీద పడితే స్నానం చేసి బల్లి ఫొటోకు దండం పెట్టుకుంటారు. ఇలా బల్లుల విషయంలో అపార్థాలకు తావివ్వకుండా మంచి ఆలోచనతో ముందుకు వెళితే మంచే జరుగుతుంది.

ఆలయ ప్రదేశాల్లో బల్లి కనిపిస్తే మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. దేవుడి గుడిలో బల్లి కనిపించినట్లయితే మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టాలు దూరమవుతాయి. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేని వాతావరణం ఏర్పడుతుంది. బల్లి గురించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బల్లిని కొందరు అపశకునంగా భావిస్తే మరికొందరు మాత్రం మంచి శకునంగానే చూస్తారు. దీంతో బల్లి కనబడితే శుభమో అశుభమో ఎవరికి కూడా అర్థం కాదు.
మనదేశంలో దీపావళిని ఘనంగా జరుపుకుంటాం. పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి రోజు బల్లి కనిపిస్తే శుభసూచకం. బల్లిని లక్ష్మీదేవిగా కొలుస్తుంటారు. దీపావళి రోజు ఇంట్లో బల్లి కనిపిస్తే చాలా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. ఇంట్లో బల్లులు కొట్లాడుకుంటే కూడా అశుభమని పరిగణిస్తారు. ఇంట్లో కూడా గొడవలు రావడానికి కారణమవుతుందట. ఇంట్లో బల్లి చనిపోతే పూడ్చిపెట్టాలట. బల్లులు పోట్లాడుకుంటే చూడటం కూడా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తుంటారు.

ఇంట్లో బల్లులు కొట్లాడుకుంటుంటే ఇంట్లోని వ్యక్తుల మధ్య మనస్పర్దలు ఏర్పడే అవకాశాలుంటాయి. కొత్తగా ఇంట్లోకి వచ్చే వారికి బల్లులు కనిపించినట్లయితే పూర్వీకుల రాక సూచిస్తుంది. ఇలా బల్లుల వల్ల మనకు కొన్ని శుభాలు, కొన్ని అశుభాలు కలగడం సహజమే. ఈ నేపథ్యంలో బల్లుల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బల్లుల విషయంలో ఏవేవో అపోహలు పట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకోకుండా మంచిగా ఆలోచించి పాజిటివ్ గా నడుచుకుంటే అన్నింట్లోనూ శుభాలే కలుగుతాయనడంలో సందేహం లేదు.