Mole Luck: జ్యోతిష్య శాస్త్రంలో పుట్టుమచ్చలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. అవి కొన్ని చోట్ల ఉంటే సంపదలు కలుగుతాయని, మరికొన్ని చోట్ల ఉంటే నష్టాలు తెస్తాయని నమ్ముతుంటారు. పుట్టుమచ్చలు కొన్ని సార్లు అవి మరకలా కనిపిస్తాయి. కానీ అవి కూడా మచ్చలే అనే విషయం మనకు తెలియదు. పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే నష్టాలు రావడం సహజమే. శరీరంలో వివిధ భాగాల్లో పుట్టుమచ్చల వల్ల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మగవారు, ఆడవారైనా పుట్టుమచ్చల విషయంలో కొన్ని తేడాలు ఉండటం కామన్. పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే మంచిదో తెలుసుకోవాలి.

కుడిచేతి మీద పుట్టుమచ్చ ఉంటే డబ్బుకు కొరత ఉండదని చెబుతారు. అన్ని సౌకర్యాలు పొందడమే కాకుండా గౌరవం కూడా వస్తుంది. అన్ని రంగాల్లో విజయాలు సాధించి అనుకున్న లక్ష్యం చేరతారు. మగవారికి కుడివైపు శరీర భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టమని పండితులు తెలియజేస్తున్నారు. మహిళలకైతే ఎడమవైపు శరీరం మీద పుట్టుమచ్చలు ఉంటే మంచిదట. ఒక వ్యక్తి శరీరంపై 12 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉండటం అంత మంచిది కాదట. కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితం సుఖంగా సాగుతుంది.
ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితంలో గొడవలే వస్తాయి. ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే వారిలో ప్రతిభ పుష్కకలంగా ఉంటుంది. మహిళలకు ఇలా ఉంటే అదృష్టం కలిసొస్తుంది. పై పెదవిపై పుట్టుమచ్చ ఉంటే హృదయం ప్రేమగా ఉంటుంది. లైంగిక కోరికలు బలంగా ఉంటాయి. కింది పెదవిపై ఉంటే వారి జీవితంలో పేదరికం ఉంటుంది. ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే నిరాశ కలుగుతుంది. కుడిబుగ్గపై ఉంటే సంపన్నులు అవుతారు. కుడిచేతిపై పుట్టు మచ్చ ఉంటే డబ్బుకు కొరత ఉండదు.

చాతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తికి లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. జీవితంలో సులభంగా పనులు చేస్తారు. అనుకున్న కోరికలు నెరవేర్చుకుని సంతోషవంతమైన జీవితం గడుపుతారు. ముఖంపై పుట్టుమచ్చ ఉంటే ప్రేమ గల వారుగా ఉంటారు. ముఖం కుడి వైపు ఉంటే విషయంపై పట్టు ఉంటుంది. ముఖం ఎడమవైపు ఉంటే డబ్బు వృథా చేస్తారు. కళ్ల లోపల పుట్టు మచ్చ ఉన్న వారు సెన్సిటివ్ గా ఉంటారు. చిన్న విషయాలపై ఎక్కువగా స్పందిస్తారు.