Pathaan Collections : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పఠాన్’ నిన్న భారీ అంచనాల నడుమ ఘానంగా విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..నాలుగేళ్ల షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఆకలిని తీరుస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ చిత్రం పడిపోయిన బాలీవుడ్ మార్కెట్ కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా చేసింది.. మొదటి రోజు ఈ చిత్రానికి వందకోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.. ఇది బాలీవుడ్ హిస్టరీ లోనే మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు.

గత ఏడాది విడుదలైన మన దక్షిణాది చిత్రం KGF చాప్టర్ 2 బాలీవుడ్ లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.. కానీ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ కి ఇప్పటి వరకు అలాంటి ఓపెనింగ్ రాలేదు..’పఠాన్’ తోనే ఆ అరుదైన రికార్డ్ నెలకొంది.
ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలలో ఈ సినిమాకి టికెట్ ముక్క కూడా దొరకడం లేదు.. ఇక హైదరాబాద్ వంటి నగరాలలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది.. ప్రస్తుతం నడుస్తున్న ఈ ట్రెండ్ ని చూస్తూ ఉంటే కచ్చితంగా ఈ చిత్రం నేడు 80 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.. మరికొంత మంది ట్రేడ్ పండితులు చెప్తున్న మాట ఏమిటంటే రెండవ రోజు వంద కోట్ల రూపాయిలకు పైగా వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని.. రెండు రోజులకు కలిపి 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి,100 కోట్ల రూపాయిలకు పైగా నెట్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇదే ఊపు కొనసాగిస్తే ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు.. చూడాలి మరి.