Homeఎంటర్టైన్మెంట్Naresh - Pavitra Lokesh Marriage: పెళ్లిళ్ల రారాజు నరేశ్‌.. నాలుగోపెళ్లి అయినా నిలబడేనా?

Naresh – Pavitra Lokesh Marriage: పెళ్లిళ్ల రారాజు నరేశ్‌.. నాలుగోపెళ్లి అయినా నిలబడేనా?

Naresh - Pavitra Lokesh Marriage
Naresh – Pavitra Lokesh Marriage

Naresh – Pavitra Lokesh Marriage: సినీ నటుడు నరేశ్‌ పెళ్లిళ్ల రారాజుగా మారాడు. కొన్నాళ్లుగా సహచర నటి పవిత్రలోకేశ్‌తో చేస్తున్న సహజీవనాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాడు. గురువారం రాత్రి రహస్యంగా ఆమెను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేశ్‌ అందరితో విడిపోయాడు. మూడో భార్య రమ్య రఘుపతితో విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులో ఉంది. విడాకులు ఇచ్చేది లేదని మూడో భార్య చెబుతోంది. ఈ క్రమంలో నరేశ్‌ నాలుగో పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. పవిత్రను పెళ్లి చేసుకున్న వీడియోను నరేశ్‌ స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. తమ పవిత్రబంధాన్ని ఆశీర్వదించాలని కోరాడు. వివాదాల మధ్య చేసుకున్న ఈ పెళ్లి అయినా నిలబడుతుందనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నారు.

గతంలోనే ప్రకటన..
సీనియర్‌ నటుడు నరేశ్, నటి పవిత్రా లోకేష్‌ గతంలోనే పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ.. ఆయన మూడో భార్య రమ్యరఘుపతి ఎంట్రీ ఇవ్వడంతో పెళ్లి సస్పెన్స్‌లో పడింది. పవిత్రతో కలిసి ఇటీవల మహాబలేళ్వరం టెంపుల్‌కు వెళ్లారు నరేశ్‌ అప్పటి నుంచి వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వైరల్‌ అయ్యాయి. ఆల్రెడీ పెళ్లయిందన్న వెర్షన్‌ కూడా ఉంది. ఇప్పుడు సడన్‌గా నరేశ్‌ మూడో భార్య రమ్య రఘుపతి సీన్‌లోకొచ్చారు. నరేశ్‌ తనను మోసం చేశారంటూ బెంగుళూరులో రిపీటెడ్‌గా మీడియా ముందుకొస్తున్నారు. నరేశ్‌ తాను కలిసి లేమని, విడాకులూ తీసుకోలేదని తెలిపారు. తమకు పిల్లలు ఉన్నారని చెప్పారు. అటువంటప్పుడు మళ్లీ మ్యారేజ్‌ కోసం ఎలా ఏర్పాట్లు చేస్తారని ప్రశ్నిస్తున్నారు రమ్య.

రమ్య ఆరోపణలు ఖండించిన నరేశ్‌..
రమ్య చెప్పేదంతా అబద్ధం అనేది నరేశ్‌ మాట. ఆమె నా కుటుంబాన్ని నాశనం చేసింది. రూ.50 లక్షలడిగి బ్లాక్‌మెయిల్‌ చేసింది.. క్రిష్ణ గారు చెబితే పది లక్షలిచ్చా.. ఇంకా వదిలిపెట్టలేదన్నారు నరేశ్‌. అలాగని పవిత్రను పెళ్లి చేసుకుంటానని చెప్పడం లేదు నరేశ్‌. తనకు ఎమోషనల్‌ సపోర్ట్‌ అవసరమని, అందుకే పవిత్రతో స్నేహంగా ఉన్నానని చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో ఫిలిం మేకింగ్‌ కోర్స్‌ పూర్తి చేసింది రమ్య. ఓ సినిమాకి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పడు నరేశ్‌తో పరిచయం ఏర్పడిందామెకు. ఇరు కుటుంబాల వారిని ఒప్పించి తొమ్మిదేళ్ల కిందట నరేశ్, రమ్య పెళ్లి చేసుకున్నారు. అయితే ఇది ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన మూడేళ్లకే విడిపోయారు రమ్య అండ్‌ నరేశ్‌.

వివాదం మధ్యలో పవిత్ర ఎంటర్‌..
నరేశ్, రమ్య మధ్య వివాదం నడుస్తుండగానే పవిత్ర భర్త, కన్నడ డైరెక్టర్‌ సుచేంద్ర సీన్లోకొచ్చారు. ఆయన పవిత్రపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు కాపురాలు కూల్చడం అలవాటేనని, ఆమెది పైలాపచ్చీసు జీవితమని, అందుకే తనను వదిలేసి వెళ్లిందని చెప్పారు సుచీంద్ర. కానీ.. సుచేంద్రను పెళ్లే చేసుకోలేదంటున్నారు పవిత్ర. ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో నరేశ్‌తో కలిసి ఉంటున్నా, నన్ను అతను ఫ్యామిలీ మెంబర్‌గా అంగీకరించారని చెప్పారు. పవిత్ర, నరేశ్‌ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఐదేళ్ల కిందట హ్యాపీ వెడ్డింగ్‌ సినిమా టైమ్‌లో వీరికి పరిచయం ఏర్పడింది. సమ్మోహనం సినిమా టైమ్‌లో వీరిద్దరి స్నేహం కుదిరింది. అప్పటి నుంచి వీరు కలిసి జీవిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఇద్దరిని పెళ్లిచేసుకుంది పవిత్ర. ఇప్పుడు నరేష్‌కీ, పవిత్రకీ 26 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌ ఉంది.

Naresh - Pavitra Lokesh Marriage
Naresh – Pavitra Lokesh Marriage

కృష్ణ మరణం సమయంలోనూ ఇద్దరి హల్‌చల్‌..
ఇటీవల సూపర్‌స్టార్‌ కృష్ణ మరణించారు. ఆసమయంలో కూడా పవిత్ర నరేశ్‌ హల్‌చల్‌ చేశారు. అన్నీ తామై వ్యవహరిస్తున్నట్లు కెమెరాల ముందు కనిపించారు. అంతకుముందే తాము పెళ్లిచేసుకోబోతున్నట్లు ఓ వీడియోను నరేశ్‌ పోస్టు చేశారు. ఇందులో లిప్‌ కిస్‌ ఇచ్చుకుంటూ కనిపించారు. తర్వాత కృష్ణ చనిపోయారు. కొన్నాళ్లు ఆగిన పెళ్లిని గురువారం నిజం చేశారు. మరి ఈ ‘పవిత్ర’బంధమైనా నిలబడుతుందో రమ్య రఘుపతి ఎంట్రీతో మళ్లీ తెగిపోతుందో చూడాలి.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular