అవినీతి కేసులో ఆరోపణలతో దాదాపు 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్ పై ఇంకా ఆ మరక పోలేదు. కోర్టులో విచారణ జరుగుతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఆయన మెడకు ఉంది.ఈ క్రమంలోనే సీఎం జగన్ గద్దెనెక్కితే రాష్ట్రాన్ని దోచుకుంటారని ప్రతిపక్ష చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఎన్నికల ముందర చేయని దుష్ప్రచారం లేదు.
Also Read: బాబు… నీకు రమేష్ లు తెలుసా…? మీ రిలేషన్ ఏమిటి అసలు?
కానీ జగన్ గద్దెనెక్కగానే తనపై పడిన ఈ మకిలిని పూర్తిగా దూరం చేసుకునేందుకు సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఒక జడ్జిని నియమించి టెండర్లను ‘రివర్స్ టెండరింగ్’ ద్వారా చేయిస్తూ ప్రభుత్వానికి డబ్బును మిగులుస్తున్నారు. హైకోర్టు జడ్జి ద్వారానే టెండర్లను ఆమోదింప చేసుకుంటూ పారదర్శకతకు పెద్దపీట వేశారు.
ఇక ఈ క్రమంలోనే ఏపీలో అవినీతిపై ఇప్పుడు జగన్ బ్రహ్మాస్త్రం సంధిస్తున్నారు. జగన్ చేస్తున్న ఈ ప్లాన్ కు ఇప్పుడు అధికారులు వణికిపోతున్నారు. అది అమలైతే ఇక ఏపీలో అవినీతి చేయాలంటే భయపడే రోజులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
అవినీతి నిరోధం, ప్రభుత్వ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీపీ ఆంజనేయులు, ఉన్నతాధికారులు, ఐఐఎం అహ్మదాబాద్ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు.
ముఖ్యంగా కోట్లు వ్యయం అయ్యే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రభుత్వంలోని ప్రతీ విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ చేయాలని.. టెండర్ విలువ కోటి రూపాయలు దాటితే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాల్సిందేనని తేల్చారు. అవినీతిపై త్వరలోనే చట్టం తీసుకురానున్నట్టు తెలిసింది.
Also Read: ఎమ్మెల్యే వంశీకి గట్టి కౌంటర్ ఇచ్చిన దుట్టా..!
ఏపీలో ఇకపై లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికితే నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని జగన్ సంచలన నిర్ణయించారు. ‘దిశ’ తరహాలోనే అసెంబ్లీలో దీనిపై బిల్లు పెట్టే దిశగా జగన్ ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం ఏసీబీకి 14400 నంబర్ ను రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టి గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానం చేయనున్నారు.
ఈ చట్టం చేస్తే ఏపీలో అధికారులు లంచాలు తీసుకొని తప్పించుకోవడానికి ఉండదు. జగన్ సర్కార్ కనుక బిల్లు పెట్టి పాస్ చేయిస్తే ఏపీలో అవినీతికి చెక్ పడుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-ఎన్నం