Mahesh- Trivikram Movie: మహేష్-త్రివిక్రమ్ మూవీపై రోజుకో పుకారు షికారు చేస్తుంది. తాజాగా ఈ చిత్ర కథ పూర్తిగా మార్చేశారని, మొదట అనుకున్నది వేరు ఇప్పుడు చేస్తున్నది వేరు అంటున్నారు. ఎస్ఎస్ఎంబి 28 అధికారికంగా ప్రకటించి చాలా కాలమే అవుతుంది. త్రివిక్రమ్ చివరి చిత్రం అల వైకుంఠపురంలో 2020 సంక్రాంతికి విడుదలైంది. ఆ మూడేళ్ళలో ఆయన నుండి మరో మూవీ రాలేదు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ 30 డైరెక్ట్ చేయాల్సింది. కారణం తెలియదు కానీ త్రివిక్రమ్ ని ఎన్టీఆర్ పక్కన పెట్టి కొరటాలకు అవకాశం ఇచ్చాడు. దీంతో త్రివిక్రమ్ మహేష్ తో మూవీని సెట్ చేసుకున్నాడు.

ఇక సర్కారు వారి పాట 2022 మే లో విడుదలైంది. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఎస్ఎస్ఎంబి 28 ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో త్రివిక్రమ్ భీమ్లా నాయక్ చిత్ర బాధ్యతలు తీసుకోవడం కూడా ఒక కారణం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన భీమ్లా నాయక్ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. దర్శకుడు సాగర్ కే చంద్రతో దగ్గరుండి సినిమా తెరకెక్కించారు.
ఎట్టకేలకు ఇటీవల మహేష్ మూవీ షూట్ ని త్రివిక్రమ్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరణ జరిపారు. అయితే షూటింగ్ కూడా మొదలయ్యాక కథలో మార్పులు చేశారనే టాక్ వినిపించింది. దీంతో ఫస్ట్ షెడ్యూల్ అనుకున్న ప్రకారం పూర్తి చేయలేదట. మధ్యలో ఆపేశారట. అలాగే ఈ చిత్ర షూట్ మొదలయ్యాక మహేష్ కుటుంబంలో రెండు మరణాలు సంభవించాయి. సెప్టెంబర్ అమ్మ, నవంబర్ లో మహేష్ నాన్నగారు చనిపోయారు.

తాజా సమాచారం ఏమిటంటే మొదట్లో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మహేష్ మూవీ తెరకెక్కించాలనుకున్నారట. ఇప్పుడు దాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మార్చేశారట. ఫ్యామిలీ ఎమోషన్స్ ఒడిసిపట్టి వెండితెరపై అద్భుతం చేయడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ గా ఉన్న అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అని చెప్పొచ్చు. మహేష్ తో ఆయన చేసే కథ ఆ తరహాలోనే ఉంటుందట. బంధువుల మధ్య ఇగోలు, అపార్ధాలతో వచ్చే గొడవలు ఆధారంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కి కొంత యాక్షన్ జోడించి తెరకెక్కించనున్నారని టాక్. ప్రస్తుతం మహేష్ స్విట్జర్లాండ్ టూర్ లో ఉన్నారు. రాగానే వచ్చే ఏడాది ఆయనపై లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు.