Rashmika Mandanna: ఈ మధ్య హీరోయిన్ రష్మిక మందాన వివాదాలతో సావాసం చేస్తున్నారు. తన నోటి దురుసు ఇతరుల మనోభావాలు దెబ్బతీస్తుంది. విమర్శలు ఎదురవుతున్నా మాట తీరు మార్చుకోవడం లేదు. తాజాగా ఆమె మరో వివాదంలో ఇరుక్కున్నారు. రష్మిక హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకి జంటగా మిషన్ మజ్ను టైటిల్ తో హిందీ మూవీ చేశారు. ఈ చిత్రం జనవరి 19న నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ మిషన్ మజ్ను స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మిషన్ మజ్ను చిత్రంలోని ఓ పాటను ఉద్దేశిస్తూ రష్మిక చేసిన కామెంట్స్ సౌత్ చిత్ర పరిశ్రమను కించపరిచేవిగా ఉన్నాయి.

రష్మిక మాట్లాడుతూ… రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్ నే. నేను చిన్నప్పటి నుండి హిందీ రొమాంటిక్ సాంగ్స్ వింటూ పెరిగాను. సౌత్ లో ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ ఉండవు. అక్కడ సినిమాల్లో మాస్ మసాలా, ఐటెం నంబర్స్ మాత్రమే కానీ, మంచి రొమాంటిక్ సాంగ్స్ రూపొందవు. ఇది నా ఫస్ట్ రొమాంటిక్ సాంగ్… అంటూ దారుణమైన కామెంట్స్ చేసింది. ఏకంగా సౌత్ ఇండియా సినిమాలను, మ్యూజిక్ ని రష్మిక తక్కువ చేసి మాట్లాడటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఆమె ఏ ప్రమాణాలు ఆధారంగా ఈ కామెంట్స్ చేశారని ఏకి పారేస్తున్నారు. ఇళయరాజా, ఏ ఆర్ రెహమాన్ వంటి మెలోడీ, రొమాంటిక్ బ్రహ్మలు సౌత్ ఇండియాలో ఉన్నారు. ఇళయరాజా ఇచ్చినన్ని రొమాంటిక్ సాంగ్స్ మరొక మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చి ఉండరు. ఇక ఏ ఆర్ రెహమాన్… బొంబాయి, రోజా, సఖి, ప్రేమదేశం, ప్రేమికులరోజు వంటి చిత్రాలకు ఇచ్చిన రొమాంటిక్ సాంగ్స్ కి మించినవి బాలీవుడ్ లో ఉన్నాయా? అని ఆమెను నిలదీస్తున్నారు.

బాలీవుడ్ మ్యూజిక్ రష్మికకు ఇష్టం అయితే వారిని పొగిడితే సరిపోతుంది. అందుకు సౌత్ సినిమా మ్యూజిక్ తో పోల్చి కించపరచాల్సిన అవసరం ఏముంది. ఇలాంటి కామెంట్స్ వివాదాలకు దారి తీస్తాయని రష్మికకు తెలియదా?. మొత్తంగా రష్మిక తన నోటి దూల, యాటిట్యూడ్ మరోసారి నిరూపించుకుంది. ఇలాంటి ప్రవర్తనతో ఆమె సొంత కన్నడ పరిశ్రమ ఆగ్రహానికి కారణమైంది. డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ సమయంలో… ఇతర భాషల వలె నాకు కన్నడ కూడా సరిగా మాట్లాడలేనని కామెంట్ చేసింది. కన్నడ అమ్మాయి అయ్యుండి భాష రాదని చెప్పడం వివాదాస్పదం అయ్యింది. అలాగే కాంతార చిత్రం చూడలేదని చెప్పి కన్నడిగుల మనోభావాలు మరింతగా దెబ్బతీసింది. ఆమెపై కోపంతో రగిలిపోతున్న కన్నడ పరిశ్రమ ఒక దశలో బ్యాన్ చేయాలనే ఆలోచన చేసింది.
After #RashmikaMandanna Got Chance To Act In Bollywood, Now She Is Blaming And Downgrading Our South Industry! She Did The Same Thing To #Kannada Industry When She Got Offer In #TFI. What An Woman🙏🤮
Moral: Once A Cheater, Always A Cheater!#Yash19 #Kichcha46 #Salaar #RRR2 pic.twitter.com/tCqzARPR7X
— Shivam Devanshka (@ShivamDevanshka) December 28, 2022