Mohan Babu: నటప్రపూర్ణ మోహన్ బాబు విలక్షణ నటుడు. తన నటనతో అందరిని మెప్పించడం ఆయనకు అలవాటే. ఆయన సినిమా రంగ ప్రవేశం మాత్రం విచిత్రంగా జరిగింది. భక్తవత్సలం నాయుడు అని పిలిచే మోహన్ బాబు గురువు దాసరి నారాయణ రావు. దాసరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే మోహన్ బాబు కు అనుకోకుండా సినిమా అవకాశం రావడం గమనార్హం. సినిమా పరిశ్రమలో చాలా మంది డైరెక్టర్లు కావాలని వచ్చిన వారు యాక్టర్లుగా తమ సత్తా చాటారు. అందులో చాలా మందే ఉన్నారు.
Also Read: టైం రా బాబు… రాజమౌళిని ఎగతాళి చేస్తున్న పవన్ ఫ్యాన్స్!
దాసరి అంతా కొత్త వారితో 1975లో స్వర్గం నరకం అనే సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. అందులో ఈశ్వర్ రావు, మోహన్ బాబు(Mohan Babu) ను కథానాయకులుగా అనుకున్నారు. కానీ అనుకోకుండా బోస్ బాబు అనే కొత్త పాత్ర ప్రవేశం అయింది. ప్రొడక్షన్ వారు బోస్ బాబును హీరోగా తీసుకోవాలని రెకమండేషన్ చేశారు. దీంతో దాసరి డైలమాలో పడిపోయారు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటే మోహన్ బాబు, బోస్ బాబుకు పరీక్ష పెట్టారు. ఎవరు బాగా నటిస్తే వారికి అవకాశం ఇస్తామని చెప్పడంతో మోహన్ బాబు నటన అందరికి నచ్చింది. దీంతో ఆయన హీరోగా మారారు.
దీంతో బోస్ బాబు వ్యాపారవేత్తగా ఎదిగారు. తరువాత కాలంలో వ్యాపారరంగంలో బాగా సంపాదించి ఎస్వీఆర్ సర్వీస్ లను నడుపుతూ ఓ స్థాయి తెచ్చుకున్నాడు. మోహన్ బాబు వల్ల బోస్ బాబు కాస్త వ్యాపారస్తుడిగా స్థిరపడ్డాడు. అందరికి అన్ని కలిసి రావు. ఎవరికి ఏది ప్రాప్తం ఉంటే అదే దక్కుతుంది. సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్నందున ఆయనకు సినిమాల్లో అవకాశం వచ్చింది. బోస్ బాబుకు వ్యాపారమే కలిసొచ్చిందని తెలుస్తోంది.
తరువాత కాలంలో ఆయన నిర్మాతగా మారి కూడా అనేక చిత్రాలు నిర్మించడం తెలిసిందే. ముక్కుసూటిగా ఉండే మోహన్ బాబుకు సహజంగా కోపం ఎక్కువే అనే విషయం అందరికి తెలిసిందే. క్రమశిక్షణకు విలువ ఇచ్చే ఆయన సమయపాలన పాటించకపోతే సెట్లోనే తిడతారనే విషయం తెలిసిందే. దీంతో మోహన్ బాబు తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ద్వారా ఎన్నో చిత్రాలు నిర్మించి తన సత్తా చాటుకున్నారు.
Also Read: ఆ హీరోయిన్ తో అక్కినేని హీరో విడాకులు… మహేష్ మనసుకు గాయమైన వేళ!