Viral Video: నేటి కాలంలో యువత సోషల్ మీడియాను విపరీతంగా ఫాలో అవుతున్నారు. సామాజిక మాధ్యమాలలో యమా యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా అనేది ఒక సముద్రం లాంటిది. అందులో మంచి ఏ స్థాయిలో ఉంటుందో.. చెడు కూడా అదే స్థాయిలో ఉంటుంది. అలాంటప్పుడు దాని ద్వారా మంచిని మాత్రమే స్వీకరించాలి. చెడుని పక్కన పెట్టాలి. కానీ నేటి కాలం యువత సోషల్ మీడియాలో మంచిని పక్కన పెట్టి చెడును మాత్రమే స్వీకరిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే వాటిని నిజం అని నమ్ముతున్నారు. వాటికి తగ్గట్టుగానే తాము కూడా ఉండాలని భావిస్తున్నారు. అక్కడే పప్పులో కాలేస్తున్నారు. చివరికి ఆభాసుపాలవుతున్నారు.
ఇక నేటి కాలంలో ప్రేమలు ఎంత సులభంగా పడుతున్నాయో.. అంతే సులభంగా విచ్చిన్నమవుతున్నాయి. అయితే ఈ జాబితాలో మైనర్లు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం.. అందులో అపరిమితమైన డాటా ఉండడంతో మైనర్లు రెచ్చిపోతున్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమ మైకంలో మునిగిపోతున్నారు. చివరికి చేయకూడని తప్పులు చేస్తూ దొరికిపోతున్నారు. కన్నవాళ్ళకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో తెలియని ఓ ఇద్దరు మైనర్లు చేసిన పని ఇప్పుడు తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన ద్వారా రెండు కుటుంబాలు రోడ్డుమీదికి వచ్చాయి. చివరికి కొట్లాటకు దిగాయి.
వరంగల్ లోని కొత్త వాడకు చెందిన ఓ బాలిక, బాలుడు ప్రేమలో ఉన్నారు. వారిద్దరు స్థానికంగా చదువుకుంటున్నారు. ఇటీవల వారిద్దరికీ ఏకాంతం దొరికింది. అసలే మైనర్లు.. పైగా ఏకాంతం దొరకడంతో రెచ్చిపోయారు. ఇద్దరూ ముద్దు పెట్టుకుంటూ దానిని వీడియో తీశారు. ఆ తర్వాత దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది కాస్త వైరల్ అయింది. ఆ దృశ్యాన్ని రెండు కుటుంబాలకు సంబంధించిన వారు చూశారు. పరస్పరం దూషణలు చేసుకుంటూ రోడ్డుమీదకు వచ్చారు. కొట్లాటకు దిగారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతం మొత్తం యుద్ధ క్షేత్రం లాగా మారిపోయింది. పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఆ బాలుడు, బాలిక స్థానికంగా చదువుకుంటున్నారని తెలుస్తోంది. వారిద్దరికీ ఇటీవల కాలంలో పరిచయమైందని.. అది ప్రేమగా మారిందని సమాచారం. ఎలాగూ ప్రేమలో ఉన్నామని వారిద్దరూ కాస్త చనువు తీసుకున్నారు. చేయకూడని పనిచేశారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త గొడవకు దారితీసింది. అయితే ఈ సంఘటన నేటి కాలంలో యువత ఎలా ఉన్నారో.. సోషల్ మీడియాకు బానిసలు అయిపోయి ఎంత దారుణాలకు పాల్పడుతున్నారో నిరూపించింది. ఈ ఘటన తర్వాత పోలీసులు ఆ బాలిక, బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చారు.. అయితే ఈ వీడియోను వారిద్దరు తమ సామాజిక మాధ్యమాలలో మరో మాటకు తావు లేకుండా డిలీట్ చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.