Homeట్రెండింగ్ న్యూస్Dead Sea: సముద్రంపై తేలుతున్న మనుషులు.. ఎక్కడో తెలుసా..?

Dead Sea: సముద్రంపై తేలుతున్న మనుషులు.. ఎక్కడో తెలుసా..?

Dead Sea: మాములుగా ఎక్కడైనా నీటిలో పడితే మునిగిపోతారన్న సంగతి తెలిసిందే. ఈత వచ్చిన వారు అయితేనే నీటిపై తేలగలరు. కానీ ఈత రాకపోతే..ఖచ్చితంగా నీటిలో మునిగిపోతారన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఈత రాని వాళ్లు సైతం నీటిపై తేలవచ్చు. అలా అని అదేమీ స్విమ్మింగ్ ఫూల్ కాదు.. కుంట కాదు..సముద్రం. ఇంతకీ ఆ సముద్రం ఎక్కడ ఉంది. ఆ సముద్రంలో ఎందుకు మునిగిపోరనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మనం చెప్పుకునే ఈ సముద్రాన్ని డెడ్ సీ అని పిలుస్తుంటారు. ఇది ఇజ్రాయెల్ , జోర్డాన్ మధ్య ప్రాంతంలో ఉంది. ఈ సముద్రపు నీటిలో కూర్చోవచ్చు, నడవచ్చు..పేపర్ చదవచ్చు.. ఇలా ఏమైనా చేయవచ్చు. సముద్రం మధ్యలోకి వెళ్లినా నీటిలో మునిగిపోరు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క సముద్రమే ఇలా ఉంటుందని తెలుస్తోంది. దీన్నే మృత సముద్రమని పిలుస్తుంటారు.

ఎక్కడైనా సముద్రపు నీరుగా ఉప్పగా ఉంటుందన్న విషయం దాదాపు అందరికీ తెలిసిన విషయమే. నీరు ఉప్పగా ఉన్నప్పటికీ ఆ సముద్రాల్లో ఎన్నో జల జీవరాశులు జీవిస్తుంటాయి. అయితే డెడ్ సీలో నీరు చాలా ఉప్పగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సముద్రంలో ఎటువంటి జీవరాశులు బ్రతకలేవు. ఒకవేళ మనం చేపలను తీసుకొచ్చి వేసినా వెంటనే చనిపోతాయని సమాచారం.

ఈ మృత సముద్రపు నీటిలో బ్రోమైడ్, జింక్, మెగ్నీషియం, పొటాష్, కాల్షియంతో పాటు సల్ఫర్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఈ కారణంగానే సముద్రంలో నీరు చాలా ఉప్పగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేవిధంగా డెడ్ సీ సముద్ర మట్టానికి సుమారు 1388 అడుగుల దిగువన ఉంది. దీని కారణంగా సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సముద్రంలోని నీటి ప్రవాహం దిగువ నుంచి పైకి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఎవరైనా ఆ నీటిలో దిగినప్పుడు వారు తేలతారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కారణంగానే సముద్రంలో వస్తువులు అయినా, మనుషుల ఎవరైనా పడితే తేలరని స్పష్టం అవుతోంది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version