NTR: ఎన్టీఆర్ ఖాతాలో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలు ఇవే..

ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటులలో తారక్ ఒకరు.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు దివంగత NT రామారావు మనవడిగా ఎంట్రీ ఇచ్చినా.. తాతకు దగ్గ మనవడిగా పేరు సంపాదించాడు.

Written By: Swathi, Updated On : January 24, 2024 2:14 pm
Follow us on

NTR: SS రాజమౌళి యాక్షన్-ఫాంటసీ ‘RRR’సినిమాతో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్నారు జూ. ఎన్టీఆర్. ఈ సినిమా ఆయన అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అయితే టాలీవుడ్ ప్రేక్షకులే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించారు ఎన్టీఆర్. భారీ పారితోషికం అందుకుంటూ చేతిలో ఫుల్ సినిమాలతో బిజీ అయిపోయారు ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్ బాలనటుడిగా మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా ప్రయాణం మొదలు పెట్టి అంచలంచెలుగా ఎదిగారు. ఎన్నో సినిమాలు హిట్లు సాధిస్తే.. కొన్ని సినిమాలు మాత్రమే ఫ్లాప్ లను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ హీరో నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి.అంతే కాదు ఫుల్ కలెక్షన్లను సాధించాయి. ఇలా ఎన్టీఆర్ ఖాతాలో ఎక్కువ కలెక్షన్లను సాధించిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటులలో తారక్ ఒకరు.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు దివంగత NT రామారావు మనవడిగా ఎంట్రీ ఇచ్చినా.. తాతకు దగ్గ మనవడిగా పేరు సంపాదించాడు. ‘RRR’ స్టార్ 2001లో ‘నిన్ను చూడాలని’తో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. కానీ ఎన్టీఆర్ ఖాతాలో మాత్రం ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లు ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్
దర్శక ధీరుడు SS రాజమౌళి ఎపిక్-యాక్షన్ ‘RRR’లో కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తారక్ ఈ సినిమాలో లీడ్‌ క్యారెక్టరును పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తనకు అభిమానులు అయ్యారు అంటే ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రముఖ పాత్ర పోషించింది అని చెప్పడంలో సందేహం లేదు.. స్వాతంత్య్ర సమరయోధుడిగా అతని నటన ప్రేక్షకుల నుంచే కాదు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందింది. అంతేకాకుండా, రామ్ చరణ్‌తో అతను చేసిన డ్యాన్స్ సీక్వెన్స్ ఇంటర్నెట్‌లో హంగామా సృష్టించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1,132 కోట్లకు పైగా వసూలు చేసింది.

జనతా గ్యారేజ్
2016లో, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ మెప్పించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా వల్ల కొన్ని గ్యారేజ్ లకు జనతా గ్యారేజ్ అని పేరు కూడా పెట్టుకున్నారు అంటే ఆ సినిమా ప్రేక్షకులను ఏ తీరున ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో వాహనాలను రిపేర్ చేయడమే కాకుండా.. సమస్యలతో వచ్చిన ప్రజల కష్టాలను తీర్చడమే వారి లక్ష్యంగా పెట్టుకుంటారు. సామాజిక అన్యాయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.ఈ సినిమా కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక హిట్ నే కాదు కమర్షియల్‌గా విజయం సాధించింది జనతా గ్యారేజ్. ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్ నటించారు. ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద రూ.135 కోట్లు వసూలు చేసింది.

లవకుశ
కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఒకటి కాదు మూడు పాత్రలు పోషించారు. ఈ నటుడు జై కుమార్, లవ కుమార్ మరియు కుశ కుమార్ అనే ఒకేలాంటి త్రిపాత్రాభినయంతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలుగా నటించారు. 45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 150 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. యాక్షన్ సీక్వెన్స్‌లకు ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అరవింద సమేత
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ చిత్రం అరవింద సమేత. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ వీర రాఘవ రెడ్డిగా నటించాడు. తారక్ సరసన పూజా హెగ్డే నటించి మెప్పించింది. పూజా హెగ్డేతో జోడీ ఈ సినిమాకు మరో హైలైట్‌. కొత్త జోడీ, యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే..సినిమాలో ఎన్నో ఎలిమెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. అంటే బాక్సాఫీస్ వద్ద రూ.165 కోట్లు రాబట్టింది. ఎన్టీఆర్, హెగ్డే కాకుండా మాత్రమే కాకుండా ఈషా రెబ్బా, జగపతి బాబు, సునీల్, నవీన్ చంద్ర, సుప్రియా పాఠక్ ఈ చిత్రంలో సహాయక పాత్రలు పోషించారు.

బాద్షా..
ఫిల్మ్ మేకర్ శ్రీను వైట్ల యాక్షన్ కామెడీ చిత్రం ‘బాద్షా’. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలలో బాద్షా ఒకటి. ఈ యాక్షన్ చిత్రంలో కాజల్ అగర్వాల్ తారక్ సరసన నటించి మెప్పించింది. ఇది జూ. ఎన్టీఆర్ నటనకే కాదు, నిర్మాణం, దర్శకత్వానికి కూడా మార్కులు పడ్డాయి. లీడ్ క్యారెక్టర్లు, సినిమాలోని సంభాషణలు, సంగీతం, డాన్స్ ఇలా అన్ని అంశాలు సినిమాను విజయవంతం చేశాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.55 కోట్లు రాబట్టింది.

ఇలా ఎన్టీఆర్ నటనతో వచ్చినా చాలా సినిమాలు అధిక కలెక్షన్లను సంపాదించాయి. అందులో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఏ సినిమా ఢీకొట్టలేకపోయింది. మరీ ముందు ముందు సినిమాలు ఎలాంటి ఫలితాలను అందించనున్నాయో అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.