https://oktelugu.com/

Moon: చంద్రుడు.. విలువైన లోహాల పుట్ట

చంద్రుడిపై సల్ఫర్ జాడ కనిపించడం అత్యంత కీలకం. ఎందుకంటే సల్ఫర్ను మంచినీటి ఉనికికి సంకేతం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : August 30, 2023 / 02:33 PM IST

    Moon

    Follow us on

    Moon: పగలంతా హాట్.. రాత్రంతా కూల్.. నిన్నటిదాకా మనకు చంద్రుడి గురించి తెలిసింది ఇదే. ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలం మీద కలియ తిరుగుతున్న నేపథ్యంలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రజ్ఞాన్ రోవర్ తన పరిశోధనలో సల్ఫర్ తో పాటు ఆక్సిజన్ ఉనికిని కూడా గుర్తించింది. రోవర్ లోని లేజర్_ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రో స్కోప్(లిబ్స్) పే లోడ్ దక్షిణ ధ్రువానికి సమీపంలో చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ (ఎస్) ఉనికిని స్పష్టంగా గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటివరకు చంద్రుడి మీద నీటి జాడలు కనుగొన్న ఇస్రో.. తాజాగా సల్ఫర్ ఉనికిని కూడా గుర్తించడం పట్ల ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

    వాటన్నింటినీ గుర్తించింది

    ప్రజ్ఞాన్ రోవర్ సల్ఫర్ తో పాటు అల్యూమినియం ( ఏఎల్), కాల్షియం (సీఏ), ఇనుము(ఎఫ్ఈ), క్రోమియం( సీఆర్), టైటానియం (టీఐ), మాంగనీస్(ఎంఎన్), సిలికాన్ (ఎస్ఐ), ఆక్సిజన్ (ఓ) లను లిబ్స్ గుర్తించింది. “ప్రస్తుతం చంద్రుడిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. రోవర్ లోని లిప్స్ దక్షిణ ధ్రువానికి సమీపంలో జాబిల్లి విపరీతలంపై సల్ఫర్ (ఎస్) ఉనికిని స్పష్టంగా గుర్తించింది. ఊహించిన విధంగానే అల్యూమినియం, కాల్షియం, ఫెర్రస్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్ లను కూడా గుర్తించింది. హైడ్రోజన్ ( హెచ్) కోసం అన్వేషణ జరుగుతోంది” అని ఇస్రో ట్విట్టర్లో ప్రకటించింది.

    చాలా కీలకం

    చంద్రుడిపై సల్ఫర్ జాడ కనిపించడం అత్యంత కీలకం. ఎందుకంటే సల్ఫర్ను మంచినీటి ఉనికికి సంకేతం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాగా, ఈ లిబ్స్ పరికరాన్ని బెంగళూరులోని లాబరేటరీ ఫర్ ఆస్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇక బుధవారం ఆకాశంలో అద్భుతం జరగనుంది. బుధవారం రాత్రి చందమామ భూమికి మరింత దగ్గరగా రానుంది. సాధారణ పౌర్ణమి కంటే మరింత పెద్దదిగా, 16% ప్రకాశవంతంగా కనిపించనుంది. అందుకే దీనిని సూపర్ బ్లూ మూన్ అంటారు. అంటే ఇది నీలం రంగులో ఉండదు. ఒక నెలలో రెండవ పౌర్ణమి వచ్చింది కాబట్టి దాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు.