Pushpa 2 Dialogue: పుష్ప 2 డైలాగ్ లీక్… ట్రెండ్ చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్!

ఈ క్రమంలో దర్శకుడు డైలాగ్ పేపర్ తీసుకుని సీన్ వివరిస్తున్న మూమెంట్ కూడా చిత్రీకరించారు. సదరు పేపర్లో ఉన్న డైలాగ్స్ జూమ్ చేసి చూస్తున్న అల్లు అర్జున్ అభిమానులు ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని డైలాగ్స్ లీక్ అయ్యాయి.

Written By: Shiva, Updated On : August 30, 2023 2:49 pm

Pushpa 2 Dialogue

Follow us on

Pushpa 2 Dialogue: అల్లు అర్జున్ కోసం ఇంస్టాగ్రామ్ ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారు. ఆయన మీద ఓ స్పెషల్ వీడియో షూట్ చేశారు. ఆ గౌరవం అందుకున్న మొదటి భారతీయ నటుడిగా అల్లు అర్జున్ రికార్డులకు ఎక్కాడు. అల్లు అర్జున్ తన లైఫ్ స్టైల్, ఇంటి పరిసరాలను ఇంస్టాగ్రామ్ టీమ్ షూట్ చేశారు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ సెట్, కాస్ట్యూమ్స్, అల్లు అర్జున్ మేకప్, కారవాన్… ఇలా చాలా విషయాలను సదరు వీడియోలో ఇంస్టాగ్రామ్ టీమ్ బంధించింది.

ఈ క్రమంలో దర్శకుడు డైలాగ్ పేపర్ తీసుకుని సీన్ వివరిస్తున్న మూమెంట్ కూడా చిత్రీకరించారు. సదరు పేపర్లో ఉన్న డైలాగ్స్ జూమ్ చేసి చూస్తున్న అల్లు అర్జున్ అభిమానులు ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని డైలాగ్స్ లీక్ అయ్యాయి. కేశవ డైలాగ్ ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ”ముందు అయితే నీకు షెకావత్ కే గొడవ మచ్చా, ఇప్పుడు సిండికేట్ కూడా ఇవ్వాల్వ్ అయ్యింది” అని డైలాగ్ పేపర్లో ఉంది. మరికొన్ని డైలాగ్స్ కూడా కనిపిస్తున్నాయి.

ఇక ఇంస్టాగ్రామ్ వీడియోలో అల్లు అర్జున్ లుక్ విడుదల చేయడం విశేషం. సదరు లుక్ లో అల్లు అర్జున్ యాటిట్యూడ్, మేనరిజం హైలెట్ గా ఉన్నాయి. కూలీ నుండి సిండికేట్ హెడ్ గా ఎదిగిన పుష్పరాజ్ స్మగ్లర్ గా ఏం చేస్తాడనేది పుష్ప 2 కథ. ఒక క్రిమినల్ కథకు దర్శకుడు సుకుమార్ ఎలాంటి ముగింపు ఇచ్చాడనే ఆసక్తి నెలకొంది. ఇక పుష్ప 2 వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం. మూవీ సమ్మర్ బరిలో నిలిచే అవకాశం ఉంది.

అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. వెయ్యి కోట్ల టార్గెట్ తో పుష్ప 2 విడుదల కానుంది. పుష్ప 2లో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పుష్ప చిత్రంలోని పాటలకు దేవిశ్రీ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్న విషయం తెల్సిందే..