Dubai Lottery: 2019: బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ కార్మికుడికి అదృష్టం వరించింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన రిక్కాల విలాస్ ఓ లాటరీని కొన్నాడు. దుబాయ్ ఏయిర్ పోర్టులో అతడికి రూ.28 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
2022: ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో దుబాయ్ కి వెళ్లిన ఓ యువడికి ఇదే లాటరీ వరించింది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగుర్ కు చెందిన అజయ్ కు ఏకంగా రూ.30 కోట్ల లాటరీ తగిలింది.
2023: తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన మొహమ్మద్ అదిల్ ఖాన్ కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇంటిరీయర్ డిజైన్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయనకు ‘ఫాస్ట్ 5’ పేరిట లాటరీ తగిలింది. లాటరీలో ఆయనకు రూ.5.5 లక్షలు నెలనెలా 25 ఏళ్ల పాటు చెల్లిస్తారు.
దుబాయ్ లాటరీని ప్రపంచంలో చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇలా ప్రతీ ఏడాది భారతీయులకు మాత్రమే దక్కుతుంది.అయితే భారతీయులకు మాత్రమే ఈ లాటరీ ఎలా తగులుతుంది? అసలు ఈ లాటరీ కథేంటి? ఎవరు కొనుగోలు చేయాలి? అనే విషయాల్లోకి వెళితే..
మనం ఏదైనా గేమ్ లో పాల్గొని ఫ్రైజ్ వస్తేనే ఎంతో సంతోష పడుతూ ఉంటాం. అలాగే ఎలాంటి పనిచేయకుండా లక్షల కొద్దీ డబ్బు వస్తే వద్దంటామా? కానీ తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తికి నెలనెలా రూ.5.5 లక్షలు జీతం వస్తుంది. దీంతో దుబాయ్ లాటరీపై ఆసక్తి పెరిగింది. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి గెలుచుకున్న లాటరీ సంస్థ ఇటీవలే ప్రారంభించింది. ఇందులో మొదటిలాటరీని భారతీయుడు గెలుచుకోవడంపై సర్వత్రా చర్చ సాగింది. కానీ అంతకుముందే దుబాయ్ ఎయిర్ పోర్టులో లాటరీ కొనుగోలు చేసిన వారు చాలా మందే ఉన్నారు.
దుబాయ్ ఏయిర్ పోర్టులో ఈ లాటరీలను అమ్ముతూ ఉంటారు. దీనిని నేరుగా ఏయిర్ పోర్టుకు వెళ్లి కొనుగోలు చేయొచ్చు. లాటరీ కొనుగోలు చేయడానికి ఏజ్ లిమిట్ అంటూ ఏదీ లేదు. కానీ ఐడెంటిటీ ఫ్రూప్ కచ్చితంగా ఉండాలి. వీటిలో పాస్ పోర్టు తప్పనిసరిగా ఉండాలి. మనం లాటరీ కొనుగోలు చేసేటప్పుడు పాస్ పోర్టు వివరాలు అడుగుతారు. ఇవి చెక్ చేసుకున్న తరువాతే లాటరీని అమ్ముతారు. పాస్ పోర్టు ఉంటే లాటరీని ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. ఆన్ లైన్ వివరాలను చాలా మంది ఫేక్ వి చెబుతూ ఉంటారు. తెలిసిన వారి నుంచి అధికారిక వెబ్ సైట్ ఏదో తెలుసుకోవడం ఉత్తమం.
ఈ లాటరీ ధర ఒక్కోటి 1,000 దినాన్స్ ఉంటుంది. ఒక్కో వ్యక్తి ఎన్ని లాటరీలు అయినా కొనుగోలు చేయొచ్చు. ఒక లాటరీ కొనుగోలు చేసిన తరువాత నెలలోపు డ్రాను నిర్వహిస్తారు.ఈ డ్రా సమయంలో లాటరీ కొన్నవారు పాల్గొనవచ్చు. లేదా ఆన్లన్లో వివరాలు తెలుసుకోవచ్చు. లాటరీ టికెట్ కొనుగోలు చేసిన తరువాత ఒకవేళ ఈ టికెట్ పోయినా భయపడాల్సిన అవసరం లేదు. లాటరీ సంస్థ నిర్వహించే వెబ్ సైట్ కు మెయిల్ పెడితే మన వివరాలన్నీ చెక్ చేసుకొని మరో టికెట్ ఇస్తారు.
చాలా మంది దుబాయ్ లాటరీలు గెలుచుకోవడం.. అదీ మన ఇండియన్స్ గెలుచుకోవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. అసలు ఈ లాటరీ నిజమా? ఫేక్ నా? అని సందేహం ఉంది. దుబాయ్ లోని ఏయిర్ పోర్టులో నిర్వహించే లాటరీ జెన్యూన్. మిగతా సంస్థలు ఫేక్ అయినా కావొచ్చు. అయితే దుబాయ్ ఏయిర్ పోర్టువారు నిర్వహించే వాటిలో ఎలాంటి తేడాలుండవు. అందుకే చాలా మంది కొనుగోలు చేస్తారు. మన ఇండియన్స్ కు అదృష్టం మీద నమ్మకం ఎక్కువ. అందుకే చాలా మంది ఇండియన్సే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అలా మనవారికే ఫ్రైజ్ లు దక్కుతున్నాయి.