Hyper Aadi: అనతికాలంలో బుల్లితెర స్టార్ గా ఎదిగాడు హైపర్ ఆది. జబర్దస్త్ సెన్సేషన్ అయ్యాడు. హైపర్ ఆది రైజింగ్ రాజు టీం చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. తన టీమ్ మేట్స్ మీద ఆది నాన్ స్టాప్ పంచ్లు కురిపించేవాడు. హైపర్ ఆది స్కిట్స్ యూట్యూబ్ షేక్ చేశాయి. ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్, జబర్దస్త్ లో హైపర్ ఆది టీమ్ ఆధిపత్యం చెలాయించాయి. టీమ్ మెంబర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆది టీమ్ లీడర్ అయ్యాడు. మొదట్లో ఆయన అదిరే అభి టీమ్ లో చేసేవాడు.
జబర్దస్త్ నుండి ఢీ… అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో హైపర్ ఆది కామెడీ ప్రస్థానం కొనసాగుతుంది. జబర్దస్త్ మాత్రం వదిలేశాడు. ప్రస్తుతం హైపర్ ఆది సిల్వర్ స్క్రీన్ మీద బిజీ అవుతున్నాడు. కమెడియన్ గా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే రచయితగా కూడా రాణిస్తున్నాడు. హైపర్ ఆది మాటలు అందిస్తున్నారు. ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సార్ చిత్రానికి హైపర్ ఆది మాటలు రాశారని సమాచారం.
హైపర్ ఆది కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా పెళ్లి పీటలు ఎక్కుతున్నాడనే ప్రచారం జరుగుతుంది. చాలా కాలంగా పరిచయం ఉన్న యూట్యూబ్ యాంకర్ ని వివాహం చేసుకోబోతున్నాడట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. హైపర్ ఆది కెరీర్ బిగినింగ్ నుండి ఆ యాంకర్ తోడుగా ఉందట. కఠిన సమయాల్లో మద్దతుగా నిలిచిందట. దాంతో ఆమెనే వివాహం చేసుకోబోతున్నాడని టాక్. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.
మరోవైపు హైపర్ ఆది రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉంటున్నారు. ఆయన జనసేన పార్టీ సభల్లో, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైపర్ ఆది ప్రకాశం జిల్లాకు చెందినవాడు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడనే ప్రచారం జరుగుతుంది.