Allu Arjun: అల్లు అర్జున్ సాధారణ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకూ ఎదిగాడు. అప్పుడే బన్నీ కెరీర్ మొదలై 19 ఏళ్లు గడిచిపోయింది. 19 ఏళ్లల్లో 20 సినిమాలకు పైగానే నటించినా.. మధ్యలో 12 సినిమాలను రిజెక్ట్ చేశాడు. అయితే.. ఆ 12లో కొన్ని బ్లాక్ బస్టర్లు కూడా అయ్యాయి. అలాగే కొన్ని డిజాస్టర్స్ కూడా అయ్యాయి. మరి అవేమిటో చూద్దాం రండి.

జయం:

అల్లు అర్జున్ జయంతో ఇండస్ట్రీకి పరిచయం కావాలి. తేజ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో అల్లు అరవింద్ ఈ కాంబినేషన్ ఫిక్స్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ కుదరలేదు. ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. నితిన్ హీరోగా ఈ సినిమా వచ్చింది. నితిన్ కెరీర్ కు గట్టి పునాది అయ్యింది.
భద్ర:

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో బోయపాటి శ్రీను భద్ర కథను ముందుగా బన్నీకి చెప్పాడు. బన్నీకి కూడా కథ బాగా నచ్చింది. కానీ ముందుకు వెళ్ళలేదు. కానీ పదేళ్ల తర్వాత బోయపాటి – బన్నీ కాంబినేషన్ లో సరైనోడు సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.
100 పర్సెంట్ లవ్:

సుకుమార్ తాను ఏ కథ రాసుకున్న ముందు బన్నీకి చెప్పడం అలవాటు. అలా 100 % లవ్ సినిమా కథ బన్నీకి చెప్పాడు. బన్నీకి కథ నచ్చలేదు. అందుకే.. ఆ సినిమా బన్నీ చేయలేదు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో పదేళ్ల తర్వాత పుష్ప వచ్చి సూపర్ హిట్ అయ్యింది.
కృష్ణాష్టమి:
సునీల్ హీరోగా వచ్చిన కృష్ణాష్టమి సినిమాను అల్లు అర్జున్ చేయాల్సింది. జోష్ సినిమా దర్శకుడు వాసు వర్మ.. లవర్ పేరుతో బన్నీకి ఈ కథ చెప్పాడు. కానీ బన్నీ రిజెక్ట్ చేసేసరికి సునీల్ హీరోగా ఈ సినిమా వచ్చింది.
పండగ చేస్కో:

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన పండగ చేస్కో సినిమాలో మొదట హీరో బన్నీనే. గోపీచంద్ మలినేని, రైటర్ కోన వెంకట్ ఇద్దరు వెళ్లి బన్నీకి కథ చెప్పారు. కానీ బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆ తర్వాత రామ్ హీరోగా ఈ సినిమా వచ్చింది.
అర్జున్ రెడ్డి:
సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమా కథను అల్లు అర్జున్ కి చెప్పాడు. కథ నచ్చినా.. అంత బోల్డ్ సినిమా చేయడానికి బన్నీ ధైర్యం చేయలేకపోయాడు.
గ్యాంగ్ లీడర్:

విక్రమ్ కె కుమార్.. తన గ్యాంగ్ లీడర్ కథను ముందు బన్నీకే చెప్పాడు. ఈ ప్రాజెక్టు ఆల్మోస్ట్ సెట్ అయింది కూడా. కానీ చివరి నిమిషంలో అల్లు అర్జున్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.
డిస్కో రాజా:
దర్శకుడు వి.ఐ.ఆనంద్.. తన డిస్కో రాజా సినిమాని ముందు అల్లు అర్జున్ తోనే ప్లాన్ చేశాడు. కథ కూడా బన్నీకి నచ్చింది. కానీ ఆ తర్వాత బన్నీ ఈ సినిమాకి కనెక్ట్ కాలేకపోయాడు. చివరకు రవితేజ హీరోగా ఈ సినిమా వచ్చింది.
గీత గోవిందం:

విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ ను చేసిన సినిమా ఇది. గీత గోవిందం కథ మొదట బన్నీకే చెప్పారు. సినిమాలో హీరోయిన్ డామినేషన్ ఉండడంతో అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ ఈ కథకు అడ్డు వచ్చింది. దాంతో బన్నీ ఈ సినిమా చేయలేదు.
జాను:
తమిళంలో సంచలన విజయం సాధించిన 96 సినిమాను తెలుగులో రీమేక్ ఇది. అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా చేయాలని దిల్ రాజు భావించాడు. కానీ సెట్ కాలేదు. శర్వానంద్, సమంత జంటగా జాను పేరుతో రీమేక్ చేస్తే తెలుగులో ప్లాప్ అయింది.
బొమ్మరిల్లు:

సిద్ధార్థ హీరోగా వచ్చిన బొమ్మరిల్లు సినిమాను మొదట అల్లు అర్జున్ హీరోగా అనుకున్నారు. భాస్కర్ వెళ్లి కథ కూడా చెప్పాడు. అల్లు అర్జున్ కి కూడా కథ బాగా నచ్చింది. కానీ ఈ సినిమా కూడా బన్నీ చేయలేకపోయాడు.
Also Read: 14 పెళ్లిళ్లు చేసుకున్న ప్రబుద్ధుడు.. ఏం చేశాడంటే?