https://oktelugu.com/

Indian Filter Coffee: మన ఫిల్టర్‌ కాఫీకి గుర్తింపు.. జాబితాలో ఎన్నో స్థానమంటే..

ఫుడ్‌ అండ్‌ ట్రామెల్‌ గౌడ్‌ ఫ్లాట్‌ఫాం టేస్ట్‌ అట్లాస్‌ విడుదల చేసిన జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా 38 రకాల కాఫీలు ఉన్నాయి. అందులో భారత్‌కు చెందిన ఫిల్టర్‌ కాఫీకి స్థానం దక్కింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 8, 2024 / 03:06 PM IST

    Indian Filter Coffee

    Follow us on

    Indian Filter Coffee: కాఫీ.. ఈ పేరు వినగానే పని ఒత్తిడిలో బిజీగా ఉంటూ బుర్ర వేడెక్కిన వారికి ఎక్కడా లేని రిలాక్స్‌ వస్తుంది. ఇక ఈ వాసన ముక్కు పుటాలకు తాకగానే హాయిగా ఫీల్‌ అవుతారు. తాగగానే కష్టం అంతా తీరినట్లుగా భావిస్తారు. అంతలా కాఫీ ప్రియులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కాఫీ లవర్స్‌ ఉన్నారు. అత్యుత్తమమైన కాఫీల జాబితాను ఫుడ్‌ అండ్‌ ట్రామెల్‌ గౌడ్‌ ఫ్లాట్‌ఫాం టేస్ట్‌ అట్లాస్‌ ఇటీవల విడుదల చేసింది.

    మొత్తం 38 కాఫీలకు ర్యాంకు..
    ఫుడ్‌ అండ్‌ ట్రామెల్‌ గౌడ్‌ ఫ్లాట్‌ఫాం టేస్ట్‌ అట్లాస్‌ విడుదల చేసిన జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా 38 రకాల కాఫీలు ఉన్నాయి. అందులో భారత్‌కు చెందిన ఫిల్టర్‌ కాఫీకి స్థానం దక్కింది. ఈ జాబితాలో మన ఫిల్టర్‌ కాఫీ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో క్యూబాకు చెందిన క్యూబన్‌ ఎస్ప్రెస్సో కాఫీ నిలిచింది. ఈ క్యూబన్‌ ఎస్ప్రెస్సో అనేది డార్క్‌ రోస్ట్‌ కాఫీ. దీనిని పంచదార ఉపయోగించి తయారు చేసే షాట్స్‌లా ఉంటుంది.

    ఎలక్ట్రిక్‌ యంత్రాల్లో…
    కాఫీ చేసేటప్పుడు కొద్దిగా చక్కెర స్టౌవ్‌ టాప్‌ ఎస్ప్రెస్సో మేకర్‌లో లేదా ఎలక్ట్రిక్‌ ఎస్ప్రెస్సో మెషీన్‌లో చేస్తారు. దీనిపై లేత గోధుమ రంగు నురగ కూడా ఉంటుంది. అందుకే దీనికి మొదటి స్థానం కల్పించారు.

    మన ఫిల్టర్‌ కాఫీ..
    ఇక భారతీయ ఫిల్టర్‌ కాఫీ స్లెయిన్‌లెస్‌ స్టీల్‌లో తయారు చేస్తారు. ఇందులో రెండు గదులు ఉంటాయి. పైభాగం చిల్లులగా ఉండి దిగువ భాగంలో కాఫీని ఉంచడానికి ఉపయోగాస్తారు. దిగువున ఉన్న గది నుంచి నెమ్మదిగా కాఫీ బయటకు రావడం జరగుతుంది. దక్షిణ భారతదేశంలో ఫిల్టర్‌ కాఫీ విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. చాలా మంది రాత్రి ఫిల్టర్‌ కాఫీని ఏర్పాటు చేసుకుని ఉదయం తాజా కాఫీని ఉక్కు లేదా ఇత్తడితో చేసిన చిన్న గ్లాస్‌లో సర్వ్‌ చేస్తారు. దబారా అనే చిన్న గిన్నెలాంటి సాసర్‌ ఉంటుంది. సర్వ్‌ చేసే ముందు చక్కగా తిరగబోసి నురుగు వచ్చేలా అందంగా సర్వే చేస్తారు.

    టాప్‌ టెన్‌ బెస్ట్‌ కాఫీలు..
    ఇక టేస్టీ అట్లాస్‌ ప్రకటించిన ప్రపంచంలోని అత్యుత్తమ పది కాఫీల జాబితాలో ఇవి ఉన్నాయి. టాప్‌ టెన్‌ జాబితాలో గ్రీస్‌కు చెందిన మూడు బ్రాండ్లు ఉండగా, క్యూబా, ఇటలీకి చెందిన రెండు బ్రాండ్లు ఉన్నాయి.

    1. క్యూబన్‌ ఎస్ప్రెస్సో (క్యూబా)
    2. సౌత్‌ ఇండియన్‌ కాఫీ (భారతదేశం)
    3. ఎస్ప్రెస్సో ఫ్రెడ్డో (గ్రీస్‌)
    4. ఫ్రెడ్డో కాపుచినో (గ్రీస్‌)
    5. కాపుచినో (ఇటలీ)
    6. టర్కిష్‌ కాఫీ (టర్కీయే)
    7. రిస్ట్రెట్టో (ఇటలీ)
    8. ఫ్రాప్పే (గ్రీస్‌)
    9. ఐస్కాఫీ (జర్మనీ)
    10. వియత్నామీస్‌ ఐస్‌డ్‌ కాఫీ (వియత్నాం)