Indian Diet On Covid 19: ప్రపంచాన్ని వణికించిన కరోనా భారత్ లోనూ విలయ తాండవం సృష్టించింది. ఇండియా పై మొదటి వేవ్ ఎఫెక్ట్ లేకపోయినా రెండో వేవ్ తో అధిక మరణాలు సంభవించాయి. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో సహజ మరణాలు తక్కవే అని కొన్ని అధ్యయనాల వల్ల తెలుస్తోంది. అంతేకాకుండా భారత్ లో కరోనా మరణాలు తగ్గడానికి కారణాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇక్కడి వారు తీసుకున్న ఆహారం కొన్ని పదార్థాలతోనే కరోనా తీవ్ర ప్రభావం చూపలేదని పేర్కొంది.
కరోనా వల్ల కలిగిన మరణాలు, వారి ఆహారపు అలవాట్లపై అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో భారత్ తో పాటు బ్రెజిల్, జోర్దాన్, స్విట్జర్లాండ్ , సౌదీ అరేబియా దేశాలను తీసుకున్నారు. ఆయా దేశాల్లో జరిగిన కరోనా మరణాలు, ఆ సమయంలో వారు తీసుకున్న ఆహారాన్ని పరీక్షించారు. దీనికి సంబంధించిన డేటాను సేకరించారు. ఈ అధ్యయనంలో భారతీలయులు ఐరన్, జింక్, ఫైబర్ అధికంగా తీసుకున్నట్లు వెల్లడైంది. అదే వారిని కాపాడిందని తెలిపింది. ముఖ్యంగా వీరు తరుచూ ఉపయోగించే పసుపు, టీ ద్వారా కోవిడ్ నుంచి రక్షణ పొందారని వారు తెలిపారు.
భారతీయులు వాడో వంటల్లో చాలా వరకు పసుపును వినియోగిస్తారు. ఇందులో కర్క్ మిన్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా దేహం ఎదుర్కొనే కొన్ని వ్యాధులను కంట్రోల్ చేస్తుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెంచుతుంది. అలా చాలా మంది సాంప్రదాయ వంటలను తీసుకోవడం వల్ల చాలా మంది భారతీయులు కరోనా బారిన పడ్డా కోలుకునే స్థాయికి చేరుకున్నారు. పసుపు మాత్రమే కాకుండా భారతీయులను ‘టీ’ కూడా కాపాడిందని ఐసీఎంఆర్ తెలిపింది.
ఇక్కడి వారు ప్రతిరోజూ తప్పనిసరిగా 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు టీ తాగే అలవాటు ఉంది. టీ తీసుకోవడం వల్ల శరీరంలో ‘హెచ్ డీఎల్’ నే పదార్థం చేరింది. టీ లో ఉండే కాటెచిన్ లో రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించడంలో సహకరించాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి కరోనా ను తట్టుకున్నారు. చాలా మంది టీ వ్యసనంగా మారినా దీనిని తరుచూ తీసుకోవడం వల్ల కొవిడ్ నుంచి రక్షణ పొందారని ఐసీఎంఆర్ ప్రతినిధులు పేర్కొన్నారు.
మిగతా దేశాల్లోని వారు పాల ఉత్పత్తులకు సంబంధించిన పదార్థాలు వాడినా వాటిలో రెడ్మిట్, ప్రాసెస్ చేసిన ఆహారాలనే ఎక్కువగా తీసుకున్నారు. దీంతో వారంతా కరోనా థాటికి తట్టుకోలేక మరణించాని అధ్యయనంలో పే్కొన్నారు. అలాగే ఇతర దేశాల్లో కాఫీ తో పాటు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నారు. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి కరోనా మరణాలకు ప్రభావితం అయ్యారు. అయితే భారతీయులు మాత్రం రోగనిరోధక శక్తి ఉండే ఆహారం తీసుకోవడం వల్ల వారికి ఫలితాన్నిచ్చిందని ఐసీఎంఆర్ పేర్కొంది.